Take a fresh look at your lifestyle.

తెలంగాణలో మద్యం షాపులను తెరవొద్దు

  • ఉద్యోగ, ఉపాధి, భవిష్యత్ గురించి చర్చించాలి
  • రాష్ట్రంలో కరోనా టెస్టులు పెంచాలి
  • తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్

తాగుబోతులు లేని తెలంగాణ కావాలంటే రాష్ట్రంలో ఎట్టి పరిస్థితితుల్లో మద్యం షాపులను తెరవద్దని, ప్రజారోగ్య పరిరక్షణకు దీర్ఘకాలిక బ్లూ ప్రింట్ మంత్రివర్గం ప్రకటించాలని తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షులు డాక్టర్ చెరుకు సుధాకర్ డిమాండ్ చేశారు. అదేవిదంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను అంతటా ఒకే విధంగా కొనసాగించాలని, ముఖ్యమంత్రులు తమ సొంత నిర్ణయాలతో కాకుండా రెడ్, ఆరంజ్, గ్రీన్ జోన్ల ఆధారంగా సడలింపు లాక్ డౌన్  ఉండాలన్నారు. వలస కార్మికులను సొంత గ్రామాలను తరలించడమే కాకుండా వారు పని చేస్తున్న యాజమాన్యాల నుండి రావాల్సిన జీతాలు, అడ్వాన్సులు ఇచ్చి ఉద్యోగ, ఉపాధి భద్రత, భవిష్యత్ గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించాలన్నారు. తెలంగాణలో టెస్ట్ లు పెంచమంటే ప్రతిపక్షాల పొద్దు పోని ఆరోపణ అని భావించడం, ఐసీఎంఆర్ ప్రకటనను కూడా తప్పుదారి పట్టించడం కెసిఆర్ కే సాధ్యం అయ్యిందన్నారు. కేసుల సంఖ్య పెరగనప్పుడు మే 4 నుండి కేంద్ర ప్రభుత్వ లాక్ డౌన్ సడలింపులు అమలు చెయ్యాలన్నారు. 5న జరిగే మంత్రి వర్గ నిర్ణయం ఇందుకు అనుకూలంగానే ఉండలన్నారు. గవర్నర్ తమిళసై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల అమలుకై రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాలన్నారు.

 

Leave a Reply