Take a fresh look at your lifestyle.

ఎదిగిన కొద్దీ ఒదగమని…..

  • స్వల్ప సమయం…..అయినా సిఎం కేసీఆర్‌ ‌గజ్వేల్‌ ‌పర్యటన సక్సెస్‌
  • ‌థాంక్స్ ‌చెప్పిన మంత్రి హరీష్‌రావు

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గజ్వేల్‌ ‌నియోజకవర్గ పర్యటన విజయవంతమైందనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు. పర్యటన జయప్రదంకు సహకరించిన ప్రజా ప్రతినిధులు, ప్రజలు, అధికారులు, మీడియా ప్రతినిధులకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు మంగళవారమిక్కడ మాట్లాడుతూ..రైతుల పంటలను కాపాడాలన్న ఉద్దేశ్యం, కొవిడ్‌ ‌నేపథ్యంలో ప్రజలు, రైతుల సమక్షంలో వేడుకగా జరుపుకోవాల్సిన ఘట్టంను సాదాసీదాగా జరిపామన్నారు. అయినప్పటికీ ప్రజలు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో స్వచ్చందంగా తరలి వచ్చారన్నారు. జిల్లా కలెక్టర్‌ ‌వెంకట్రామరెడ్డి, పోలీసు కమిషనర్‌ ‌జోయల్‌ ‌డేవిస్‌, ఉన్నతాధికారులు, పోలీసు సిబ్బంది, మీడియా ప్రతినిధుల సహకారం, సమన్వయం వల్లే సిఎం కేసీఆర్‌ ‌పర్యటన విజయవంతమైందన్నారు. జిల్లా కలెక్టర్‌ ‌వెంకట్రామరెడ్డి కూడాపర్యటన విజయవంతం చేసినందుకుగానూ అధికారులకు, ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు.

స్వల్ప సమయం….. అయినా సూపర్‌ ‌సక్సెస్‌
‌గజ్వేల్‌ ‌నియోజకవర్గంలో సిఎం కేసీఆర్‌ ‌పర్యటన ప్రశాంతంగా, విజయవంతంగా ముగియడం వెనకాల రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నీ తానై నడిపించారు. సిఎం కేసీఆర్‌ ‌గజ్వేల్‌ ‌పర్యటనకు సంబంధించి స్వల్ప సమయంలోనే కేసీఆర్‌ ‌పర్యటనను సూపర్‌ ‌సక్సెస్‌ ‌చేశారు. మంత్రి హరీష్‌రావుకు ఏదైనా పని అప్పగిస్తే ఆ పనిని నూటికి నూరు శాతం సక్సెస్‌ ‌చేస్తాడన్నది మరోసారి రుజువైంది. గజ్వేల్‌ ‌నియోజకవర్గంలో సిఎం కేసీఆర్‌ ‌పర్యటన నిన్నటి రోజు(సోమవారం)న మధ్యాహ్నం అధికారికంగా ఖరారైంది. అప్పటి వరకు సిద్ధిపేటలో పలు కార్యక్రమాలలో బిజీగా ఉన్నప్పటికీ ..సిఎం కేసీఆర్‌ అధికారికంగా ఖరారైన వెంటనే మంత్రి హరీష్‌రావు హుటాహుటిన సిద్ధిపేట నుంచి గజ్వేల్‌కు చేరుకున్నారు. క్షేత్ర స్థాయిలో జిల్లా కలెక్టర్‌, ‌సిపితో కలిసి పర్యటించారు.

సిఎం పర్యటన ఏర్పాట్ల పై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. తక్కువ సమయం ఉన్నప్పటికీ చకచకా ఏర్పాట్లు జరిగేలా పర్యవేక్షణ చేశారు. కంటిమీద కునుకులేకుండా ఏర్పాట్ల పురోగతిని సమీక్షిస్తూ… మంగళవారం వేకువ జాములోగానే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యేలా చూశారు. మొత్తంగా తాజాగా…మరోసారి గజ్వేల్‌లో సిఎం కేసీఆర్‌ ‌పర్యటన సందర్భంగా పనిరాక్షసుడుగా పేరుతెచ్చుకున్న మంత్రి హరీష్‌రావు మార్క్ అడుగడుగునా కనబడింది. అయితే, కొసమెరుపు ఏంటంటే…సిఎం కేసీఆర్‌ ‌పర్యటనను గంటల వ్యవధిలోనే సక్సెస్‌ అయ్యేలా చేసిన మంత్రి హరీష్‌రావు…సిఎం కేసీఆర్‌ ‌పర్యటనను సక్సెస్‌ ‌చేసినందుకుగానూ ప్రజా ప్రతినిధులు, ప్రజలు, అధికారులు, మీడియా ప్రతినిధులకు మంత్రి ధన్యవాదాలు తెలపడం. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండటమంటే ఇదేనేమో అని అందరు మాట్లాడుకుంటున్నారు. హరీష్‌రావుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

కాళేశ్వరం నీళ్లతో.. యాసంగిలో అదనంగా 60 వేల ఎకరాలలో పంట: మంత్రి హరీష్‌రావు
కాళేశ్వరం నీళ్ల రాకతో.. వానాకాలం కంటే యాసంగిలో అదనంగా 60 వేల ఎకరాలలో పంట అధికంగా పండుతున్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. సిద్ధిపేట జిల్లా నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది గ్రామ శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్నిల కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్‌రావు హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ..వానాకాలంలో 2 లక్షల 20 వేల ధాన్యం పండుతుందన్నారు. కానీ, రాష్ట్రానికి కాళేశ్వరం జలాల రాకతో.. ఈ యాసంగిలోనే 2 లక్షల 80వేల ఎకరాల్లో ధాన్యం పండిందని మంత్రి చెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్టు-రంగనాయకసాగర్‌తో పల్లెల్లోని చెరువులు, కుంటలన్నీ నిండు కుండలా మారాయని మంత్రి వెల్లడించారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో దేవాలయానికి వచ్చే దారికై రూ.10 లక్షలతో సిసి రోడ్‌ ‌వేసుకున్నట్లు, అలాగే గ్రామాన్ని దత్తత తీసుకున్న రవీందర్‌ ‌సహకారంతో 3 లక్షల రూపాయలతో ఆలయంలో గ్రానైట్‌ ‌బండలు వేసుకున్నట్లు తెలిపారు. గ్రామ గౌడ కులస్తులు 5 ఎకరాల భూమి కేటాయింపు చేయాలని కోరిన మేరకు త్వరలోనే ఇప్పిస్తానని హామీనిచ్చారు. మండుటెండల్లో గుర్రాలగొంది గ్రామ చెరువు మత్తడి దూకుతున్నదని ప్రజలంతా సంబురంతో ఉన్నారని, యువత ఉత్సవాలను అత్యంత ఘనంగా జరుపుతున్నారని మంత్రి చెప్పుకొచ్చారు.

కొరోనాను నిర్లక్ష్యం చేయొద్దు.. ప్రజలకు పిలుపునిచ్చిన మంత్రి హరీష్‌రావు
సెకండ్‌ ‌వేవ్‌తో విజృంభిస్తున్న కొరోనా అంటే నిర్లక్ష్యం చేయొద్దని, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని ప్రజలకు రాష్ట్ర మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు. కొరోనా ఇబ్బంది దృష్ట్యా ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని, కొరోనా బారిన పడకుండా ఎవ్వరికీ వారే కాపాడుకునేలా మాస్కులు ధరించి క్షేమంగా ఉండాలని కోరారు.

Leave a Reply