Take a fresh look at your lifestyle.

ఎన్నికల నిర్వహణలో పొరపాట్లు జరగొద్దు జగిత్యాల కలెక్టర్‌ ‌శరత్‌

Do not make mistakes in election district collector sharat

‌మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ‌శరత్‌

జగిత్యాల: మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న నేపద్యంలో జరుగనున్న ఎన్నికల నిర్వహాణపై ఎలాంటి పొరపాట్లు జరగరాదని జగిత్యాల జిల్లా కలెక్టర్‌ ‌డా.శరత్‌ అన్నారు. సోమవారం కలెక్టరేటు చాంబర్‌లో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్బంగా అయన మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో బాగంగా నామినేషన్ల ప్రక్రియ పూర్తయిందని పోటిలో నిలిచిన అభ్యర్థుల పేర్లు, గుర్తుల కేటాయింపుల్లో ఎలాంటి పొరపాట్లు జరగరాదని, అధికారులు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకొవాలని అయన సూచించారు. డిస్ట్రిభ్యూషన్‌, ‌రిసేప్షన్‌ ‌కేంద్రాలను, పోలీంగ్‌ ‌కేంద్రాలను స్వయంగా పరిశీలించి ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

పోలీంగ్‌ ‌స్టేషన్ల వారీగా వికలాంగులను గుర్తించి వారిని ఇంటి నుంచి పోలీంగ్‌ ‌కేంద్రాలకు తీసుకొని వచ్చి ఓటు వేయించేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. వికలాంగుల కోసం వీల్‌ ‌చైర్‌ ఎర్పాట్లు చేయాలన్నారు. ఎన్నికల సిబ్బందితోపాటు కౌంటింగ్‌ ‌సిబ్బంది కూడా ఎంతమంది అవసరమో మారోమారు సరిచూసుకోవాలన్నారు. పోలీంగ్‌ ‌స్టేషన్ల వారీగా వెబ్‌ ‌కాస్టింగ్‌, ‌విడియో కవరేజ్‌తోపాటు సిసి కేమరాలు, మైక్రో అబ్జర్వర్లు, బందోబస్తు ఏర్పాట్లతోపాటు ఎన్నికలలో పాల్గోనే సిబ్బంది శిక్షణ ఏర్పాట్లను చూసుకోవాలన్నారు. మున్సిపల్‌ ‌చట్టం ప్రకారం ఎన్నికల నియమావళి ప్రకారం ఓటర్లకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబందిత అధికారులకు కలెక్టర్‌ ‌సూచించారు. ఈసమావేశంలో డివిజనల్‌ అధికారులతోపాటు నోడల్‌ అధికారులు, మున్సిపల్‌ ‌కమీషనర్లు ఉన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply