Take a fresh look at your lifestyle.

బంగారు, వెండి గొడ్డలికి ఆశ పడకు

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు
ప్రజా రథాన్ని నడిపించే తంత్రాలు!
సారధులను ఎంచుకునే వరాలు!
పలు ఎన్నికలు ఉప ఎన్నికలు
ప్రజా పరిణతికి పరీక్ష!
ప్రజాస్వామ్య పరిరక్షణకు
శ్రీ రామ రక్ష!
తంత్రమంటే పగలు ప్రతీకారాలకు
వేదిక కారాదు!
ప్రజా తంత్రం ప్రజల ఆశలు నెరవేర్చే
మంత్రం కావాలి!
ఎన్నికలు అంటే…
కష్టాల కట్టెలు కొట్టుకొని బ్రతికే
ప్రజల గొడ్డలి జారి నదిలో పడితే
వరాలు ఇవ్వడానికి వచ్చిన దేవత!
బంగారు గొడ్డలి, వెండి గొడ్డలికి
ఆశ పడకు! అత్యాశకు పోతే
ఆశాభంగం అవుతుంది!
అన్యమైన వాటిని ఆశించకు!
ఆత్మ గౌరవాన్ని మరువకు!
అసలైన అవసరాన్నే కోరుకో
అనుగ్రహిస్తుంది!
ఆశయం నెరవేరుతుంది!
   – పి.బక్కారెడ్డి, 9705315250.

Leave a Reply