Take a fresh look at your lifestyle.

తిండి లేదు,. ప్రభుత్వ సాయం లేదు… వెంటాడుతున్న కొరోనా భయం..

కొరోనా కారణంగా అన్నీ స్థంబించిపోయాయి. పనులు లేవు, ఎక్కడికెళ్ళాలో తెలియదు. స్వస్థలాలకు వెళ్ళాలంటే ఎక్కడికక్కడ ఆంక్షలు..అవరోధాలు. భివాండి జౌళి మిల్లుల్లో పని చేసే వారి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. దేశంలో ఏ ముప్పు వచ్చినా దాని ప్రభావం ఈ నగరం మీద పడుతూ ఉంటుంది.  నగరంలో అందరి మాదిరిగా తమకు కూడా రేషన్‌ ఇవ్వాలని సిబ్బందిని అడుగుతున్నారు. ఇక్కడ పని చేసే నేత కార్మికులకు తిండి దొరకడం లేదు.  సామాజిక దూరాన్ని పాటించాలన్నది నేత కార్మికుల విషయంలో సాధ్యపడటం లేదు.

  • భివాండీ నేత కార్మికుల వెతలు

వానీ అంటే ముందుగా గుర్తొచ్చేది నేత కార్మికుల పాట్లు. ఈ నగరంలో ఏడు లక్షల మంది నేత కార్మికులు ఉన్నారు. వీరు నూలు వడుకు తారు. జౌళి మిల్లుల నగరంలో వస్త్రాలు ఉత్పత్తి చేస్తారు. వీరంతా వలస కార్మికులే కావడం గమనార్హం,. కరోనా కారణంగా పనులన్నీ ఆగిపోయాయి. పనులు లేవు, ఎక్కడికెళ్ళాలో తెలియదు. స్వస్థలాలకు వెళ్ళాలంటే ఎక్కడికక్కడ ఆంక్షలు. అవరోధాలు. భివాండి జౌళి మిల్లుల్లో పని చేసే వారి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఈ నగరంలో కొండాచివాడి బస్తీ ఉంది, దేశంలో ఏ ముప్పు వచ్చినా దాని ప్రభావం ఈ నగరం మీద పడుతూ ఉంటుంది. నగరంలో అందరి మాదిరిగా తమకు కూడా రేషన్‌ ఇవ్వాలని సిబ్బందిని అడుగుతున్నారు. ఇక్కడ పని చేసే నేత కార్మికులకు తిండి దొరకడం లేదు. సామాజిక దూరాన్ని పాటించాలన్నది నేత కార్మికుల విషయంలో సాధ్య పడటం లేదు. ఆహార ధాన్యాల కొరత కనిపిస్తోంది. వారిని పట్టించుకునే వారు లేరు. తమ భవిష్యత్‌ ‌పై వారు ఆందోళన చెందుతున్నారు. ఎనిమిది రోజులుగా వారి పరిస్థితిలో మార్పు లేదు. ప్రభుత్వం లాక్‌ ‌డౌన్‌ ‌ప్రకటించిందనీ, ఏమీ దొరకవన్న సమ ధానం లభిస్తోంది.

వీరంతా దినసరి కార్మికులే. భివాండీలోని ఆరు లక్షల మంది నేత కార్మికులను ఆకలి మంటలకు వదిలేశారు. లాక్‌ ‌డౌన్‌ ‌పాటించాలని ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ‌థాకరే మొదట విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నుంచి అలాంటి విజ్ఞప్తి వచ్చింది. దాంతో పనులు మానేశామని మహ్మద్‌ ‌సజ్జాద్‌ అన్సారీ ఆవేదనతో అన్నారు. ఆయన బీహార్‌ ‌లోని మధుబనికి చెందిన వారు. చిన్న రుకు గదిలో ఉంటున్నారు. వైరస్‌ ‌సోకే లోగా మేమంతా ఆకలితో చచ్చిపోవచ్చు అని ఆయన నైరాశ్యంగా అన్నారు. మమ్మల్ని బోనులో పెట్టినట్టుగా చిన్న గదిలో కుక్కారు. గాలి పీల్చుకోవడానికి బయటికి వస్తే పోలీసులు లాఠీ చార్జి చేస్తున్నారు. భివాండీ ముంబాయికి 30 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి జౌళి మిల్లుల్లో అసోం, పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, ‌జార?ండ్‌, ‌బీహార్‌, ఆం‌ధ్రప్రదేశ్‌, ‌కర్నాటకలకు చెందిన కార్మికులు కూడా ఉన్నారు. ఆరు లక్షల మంది కాకుండా దినసరి వేతనాలపై పని చేసే వారు లక్షమంది వరకూ ఉంటారని అన్సారీ చెప్పారు.

మార్చి 31 వరకూ జౌళి మిల్లులను మూసివేయాలని థాకరే మార్చి 21న ఆదేశించారు. రెండు వారాల్లో అంతా మామూలు స్థితికి వస్తుందను కున్నాము, ప్రస్తుత పరిస్థితి చూస్తే ఎంత కాలం పడుతుందో తెలియడం లేదు. ఇక్కడే ఉండిపొమ్మనమని, రోజూ ఆహారం వస్తుందని జౌళి మిల్లు యజమాని షాహాబ్‌ ‌చెప్పారు. లాక్‌ ‌డౌన్‌ ‌ప్రకటించాగానే కొందరు కార్మికులు కల్యాణ్‌ ‌స్టేషన్‌ ‌కి పరుగులు తీశారు. కానీ, రైళ్ళు లేవనే సరికి వారు నిరాశకు గురి అయ్యారు. వేరే మార్గం లేక తాముంటున్న రూంలకు వచ్చారు. వారం రోజులుగా తిండి లేక మా గదుల్లోనే గడుపుతున్నామని షామ్‌ ‌మహ్మద్‌ఇస్లాం అన్నారు. ఈ జౌళి మిల్లుల్లో వీరంతా పదేళ్ళు పైగా పని చేస్తున్నారు. రోజుకు రెండు షిప్టులు ఉంటాయి. రోజుకు 16 గంటలు పని చేయాలి. రోజుకు వారికి 300 నుంచి 500 రూపాయిల వరకూ చెల్లిస్తారు. మాలాంటి కార్మికుల గురించి ఆలోచించకుండా ప్రధానమంత్రి లాక్‌ ‌డౌన్‌ ‌ప్రకటించడం వల్ల ఆకలి మంటలతో అల్లాడుతున్నామని సాధిక్‌ ‌షేక్‌ అనే యువకుడు అన్నాడు.

షేక్‌ ఆం‌ధ్రప్రదేశ్‌ ‌లోని కర్నూలు జిల్లాకు చెందిన వాడు పదేళ్ళుగా ఈ ఫ్యాకటరీలో పని చేస్తున్నాడు. తాము తెచ్చుకున్న బియ్యం ,ఇతర నిత్యాసరాలు అయిపోవచ్చాయని అతడు చెప్పాడు. తమను పట్టింతుకున్న వారెవరూ లేరని అతడు అన్నాడు. గతంలో పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌ ‌టి నిర్ణయాల వల్ల కార్మికులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని అన్సారీ అనే ఒక మిల్లు యజమాని వాపోయారు. 106 పవర్‌ ‌లూమ్‌ ‌ను విక్రయించేందుకు అతడు సిద్దంగా ఉన్నాడు. మిల్లుల్లో ఉండే మెస్‌ ‌లు కార్మికులకు భోజనం పెట్టలేని స్థితిలో ఉన్నాయి. 200 మంది కార్మికులు తమ భవిష్యత్‌ ‌గురించి ఆందోళన చెందుతు న్నారు. నా భార్య రోజూ ఫోన్‌ ‌చేస్తోంది. ఏం చెప్పాలో తెలియడం లేదు అని మహేష్‌ అనే యువకుడు వాపోయారు.
– ‘ద వైర్‌’ ‌సౌజన్యంతో.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy