Take a fresh look at your lifestyle.

ఆర్కే అంత్యక్రియలకు ఆటంకం కలిగించొద్దు..: డా. చెరుకు సుధాకర్

హైదరాబాద్ ,అక్టోబర్ 14; చత్తీస్ గఢ్ బస్తర్ జిల్లా బీజాపూర్ అటవీ ప్రాంతంలో అనారోగ్యంతో మృతి చెందిన మావోయిస్టు పార్టీ అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్ కె మృత దేహానికి అంత్యక్రియలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అవరోధాలు సృష్టించకుండా సజావుగా జరిగేలా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పూర్తీ బాధ్యత వహించాలని ఇంటి పార్టీ అధ్యక్షుడు డా.చెరుకు సుధాకర్ డిమాండ్ చేశారు.

కోవిడ్ అనంతర వ్యాధులతో మరణించినట్లు భావిస్తున్నామని …గతంలో మావోయిస్టు మరో అగ్రనేత హరిభూషణ్ మరణం సందర్బంగా ఇదే అంశాన్ని డిమాండ్ చేసినట్లు తెలిపారు.కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటానికి పిలుపునిచ్చిన ఆర్కే మృతదేహానికి అంత్యక్రియలు గౌరవ ప్రదంగా జరపడమే ఆయనకు నివాళి అనీ ..ఇందుకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ చొరవ చూపాలని కోరారు.

Leave a Reply