Take a fresh look at your lifestyle.

ఆత్మహత్యలు వద్దు – నిండైన జీవితం ముద్దు

ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబరు 10న జరుపు కుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యల నివారణ కోసం ప్రజల్లో అవగాహన కలిగి ంచడానికి 2003వ సంవత్సరం నుండి ఆత్మ హత్యల నివారణ కోసం అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ అసోసియేషన్‌, ‌ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ మానసిక ఆరోగ్య సమా ఖ్యలతో కలిసి ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం. హైదరాబాద్‌లో కొరోనా సోకిందన్న భయంతో ఓ సాఫ్ట్ ‌వేర్‌ ఇం‌జనీర్‌ ఆత్మహత్య చేసుకొని తనువు చాలించింది. విజయనగరం జిల్లా కేంద్రంలోని పీటీసీ (పోలీస్‌ ‌ట్రైనింగ్‌ ‌కాలేజీ) లో ఓ మహిళా ఎస్సై ఆత్మహత్య చేసుకొన్న సంఘటనతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒక్కసారిగా దు:ఖ సాగరంలో మునిగిపోయారు. తమకు స్మార్ట్ ‌ఫోన్‌ ‌లేదని ఆన్‌లైన్‌ ‌క్లాసులు వినలేకపోతున్నామని విద్యార్దులు ఆత్మహత్య చేసుకుంటున్నారు.ఇదే క్రమంలో ఆన్‌లైన్‌ ‌క్లాసులు అర్థం కావడం లేదంటూ ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల జరిగిన ఇలాంటి కొన్ని సంఘటనలు తీవ్ర దిగ్బ్రాంతిని కలుగ చేస్తున్నాయి.

అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినోత్సవం 2021
ప్రపంచవ్యాప్తంగా మరణించిన ప్రతి 100 మందిలో ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇది మనలో ప్రతి ఒక్కరిని ప్రభావితం చేయవచ్చు. ప్రతి ఆత్మహత్య వినాశకరమైనది వారి చుట్టూ ఉన్న ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. జీవితం పైన అవగాహన పెంచడం, ఆత్మహత్య కారణాలను తగ్గించడం, జీవితంపై ఆశలను సృస్టించడం, జీవిత విలువను పెంచుకోవడానికి  ప్రోత్సహించడం ద్వారా ఆత్మహత్య చేసుకునే సందర్భాలను తగ్గించవచ్చు.

సహాయం కోరడానికి స్టిగ్మా ఒక ప్రధాన అడ్డంకి ఉంది. ఆత్మహత్య ఆలోచనలు కలిగిన వ్యక్తి ఇతరుల సహాయం కొరడానికి స్టీగ్మా ఒక ప్రధాన అడ్డంకిగా ఉంది. వ్యక్తిలో ఆశను ప్రోత్సహించడం ద్వారా ఆత్మహత్య ఆలోచనలు మార్చడం వలన ఆత్మహత్యల రహిత సమాజాన్ని సృష్టించవచ్చు. ఆత్మహత్య ఆలోచనలను అధిగమించి జీవితాశయాన్ని నెరవేర్చుకున్న వ్యక్తుల జీవిత కథలను తెలియచేయడం ద్వారా వ్యక్తులు తమవంతు సహాయం కోసం చేరుకోవడంలో చాలా శక్తివంతమైనవి. ఆత్మహత్య ఆలోచనలు కలిగిఉన్న వ్యక్తుల భావోద్వేగ బాధలు, ఆత్మహత్య ఆలోచనలు లేదా ప్రయత్నం మరియు వారి రికవరీ అనుభవాల వ్యక్తిగత కథలు ఇతరులు కూడా ఆశావాదాన్ని ప్రేరేపించగలవు, కష్టాలను ఎదుర్కొనే మనోదైర్యాన్ని నింపుకోగలరు. ఆత్మహత్యల నుండి బయట పడ్డ  వారి కొత్త సాధారణ జీవితాన్ని ఎలా అనుభవించాలో అనుభవాలను పంచుకునే వ్యక్తులు, ఆత్మహత్య నష్టాన్ని అనుభవిస్తున్న ఇతరుల నష్టాన్ని తట్టుకుని జీవించగలరని నమ్ముతారు.

వంద మరణాలలో ఒకటి ఆత్మహత్యే:  ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో సంవత్సరానికి 703,000 మంది పైగా, ప్రతి 100 మరణాలలో ఒకటి (1.3%) కంటే ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకున్నారు. ప్రతి 40 సెకనులకు ఒక్కరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా, 15-29 సంవత్సరాల వయస్సులో మరణానికి నాల్గవ ప్రధాన కారణం ఆత్మహత్య (ప్రమాదాలు, నరహత్య, క్యాన్సర్‌ ‌మరియు గుండె జబ్బులు). ఆడవారి కంటే రెండు రెట్లు ఎక్కువ మంది పురుషులు ఆత్మహత్య కారణంగా మరణిస్తున్నారు (100,000 మంది పురుషులకు 5.4 తో పోలిస్తే 100,000 మంది పురుషులకు 12.6). డిప్రెషన్‌ ‌లేని వ్యక్తి కంటే డిప్రెషన్‌తో బాధపడుతున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి ఇరవై రెట్లు ఎక్కువ అవకాశం ఉంది. ఆత్మహత్య మరణాల విషయంలో రష్యా అగ్రస్థానంలో ఉండగా, (2016 డేటా ప్రకారం) 100,000 మందికి 17 మందితో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. ఇండియాలో దాదాపుగా రెండు దశాబ్దాల నుండి ఆత్మహత్యల రేటు పెరుగుతుండడం ఆందోళనకరమైన అంశం. ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నవారిలో 40 సంవత్సరాలలోపు 80% మంది, ప్రతి 20 మందిలో ఒకరు చనిపోతున్నారని, విషం ద్వారా 36.6% మంది, ఉరి వేసుకోవడం ద్వారా 32.1% , ఇతర మార్గాల ద్వారా 7.9% మంది,  నేడు సాంకేతికంగా ఎంతో అభివృద్ది చెందుచున్నప్పటికి యువత, ఉద్యోగులు మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని గణాంకాలు తెలియచేస్తున్నాయి.

పరోక్ష సంకేతాలను పరిశీ లించాలి:  ఆత్మహత్యకు పాల్పడే వారిలో కొన్ని మార్పులు గమనిం చవచ్చు. ఒంటరితనంనకు ఇష్టప డటం, మద్యం అతిగా సేవిం చటం, ప్రతికారం తీర్చుకోవడం గురించి ఎక్కువగా మాట్లాడటం, తీవ్ర మానసిక ఒత్తిడిని ప్రదర్శి ంచడం, అతిగా నిద్ర పోవడం, రాత్రి సమ యంలో నిద్ర పోకుండా అతిగా ఆలోచి ంచడం, అనవసర (ప్రాధాన్యతలేని) విషయాల పట్ల అతిగా స్పందించటం, అసలు స్పందించక పోవటం, చనిపోతున్నాని ముందుగానే పరోక్షంగా సంకేతాలు ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి చేష్టలను ముందుగానే స్నేహితులు, కుటుం బసభ్యులు పరిశీలించి సైకాలజిస్ట్ ‌ను సంప్రది ంచడం ద్వారా కౌన్సెలింగ్‌, ‌సైకాలజికల్‌ ‌థెరపీ ద్వారా కొంత వరకు ఆత్మహత్య ఆలోచలను నివారించవచ్చును. ఆత్మహత్యల్లో భారత్‌ ‌రెండవ స్థానం: ఆత్మహత్యల్లో భారత దేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండడం ఆందోళన కలిగించే అంశం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో పత్రీ 40 సెకన్లకు ఒక ఆత్మహత్య జరుగుతుండగా, మన దేశంలో ప్రతీ రెండు నిమిషాలకు ఒకరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యకు పాల్పడుతున్న వారిలో 15 నుంచి 29 ఏళ్లలోపు వారే ఎక్కువ కావడం, మహిళల కంటే పురుషులే ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెపుతున్నాయి.

జీవితం పై ఆశను సృష్టిద్దాం ఆత్మహత్యలు నివారిద్దాం
చర్య ద్వారా ఆశను సృష్టించడం అనేది ఆత్మ హత్యకు ప్రత్యామ్నాయం ఉందని గుర్తుచేస్తుంది. ప్రజలందరిలో  విశ్వాసం మరియు వెలుగును ప్రేరేపించడమే లక్ష్యంగా పనిచేయాలి. ఆత్మహ త్యను నివారించడం సాధ్యమవుతుంది. ఎవరైనా వ్యక్తులు చీకటి క్షణాల్లో బ్రతుకుతున్న వారిలో వెలుగును ప్రసాదించడానికి, ఆత్మహత్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వారికి లేదా ఆత్మహత్యతో బాధపడుతున్న వారికి మాట సాయం, వారికి అవసరమైన మద్దతు ఇవ్వడంలో సమాజ పాత్ర ఉంది.

ఆత్మహత్య ఆలోచనలు సంక్లిష్టంగా ఉంటాయి. ఆత్మహత్యకు దారితీసే కారకాలు మరియు కారణాలు సంక్లిష్టంగా ఉంటాయి. ఆందోళన మరియు డిప్రెషన్‌ ‌వంటి మానసిక ఆరోగ్య పరిస్థితులు కూడా ఒక కారణమవుతాయి. ఆత్మహత్య చేసుకునే వ్యక్తులు తమ స్నేహితులు, కుటుంబం మరియు చుట్టుపక్కల వారితో కలవడానికి ఇబ్బందిని ఎదుర్కొంటారు. ఒంటరిగా ఉండడానికి ఇష్ట పడుతూ ఉంటారు. మహమ్మారి •••×ణ -19 ఒంటరితనం మరియు దుర్బలత్వం యొక్క భావాలను పెంచడానికి దోహదపడింది. చర్య ద్వారా ఆశను సృష్టించడం ద్వారా, ఆత్మహత్య ఆలోచనలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు జీవితం పై ఆశ పెరగడానికి వారి పట్ల శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. మీరు తన పట్ల శ్రద్ధ వహిస్తున్నారని చూపించడం ద్వారా ఎవరికైనా ఆశను అందించడంలో మీరు సహాయపడవచ్చు. ఎవరైనా తమ బాధలు లేదా ఆత్మహత్య ఆలోచనలు అనుభవాలను చెబితే వినడానికి సమయం మరియు స్థలాన్ని కేటాయించడం ద్వారా వారిలో ఆత్మహత్య ఆలోచనలు తగ్గించడానికి సహాయపడుతుంది. ఆత్మహత్య ఆపగల మరణం. చిన్న చర్చ జీవితాలను కాపాడగలదు వ్యక్తిలో ఆశను సృష్టించగలదు అని గుర్తుంచుకోండి.

dr atla srinivas reddy
– డా.అట్ల శ్రీనివాస్‌ ‌రెడ్డి
అసోసియేషన్‌ ఆఫ్‌ ‌రిహాబిలిటేషన్‌ ‌సైకాలజీస్టస్ అం‌డ్‌ ‌ప్రొఫెషనల్స్ ఇం‌డియా జాతీయ అధ్యక్షుడు, 9703935321

 

Leave a Reply