Take a fresh look at your lifestyle.

‌ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కావొద్దు

ప్రభుత్వ భూమిని మొత్తం సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలని ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించకుండా చూడాలని మహబూబాబాద్‌ ‌జిల్లా కలెక్టర్‌ ‌వీపీ గౌతం అన్నారు, బుధవారం మండల కేంద్రం లోని వివిధ ప్రాంతాలను తాసిల్దార్‌ ‌కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిధిలమైన భవనాలను తొలగించాలని అధికారులను ఆదేశించారు.జూన్‌ 1 ‌నుండి 8 వరకు వారం రోజుల పాటు చేపడుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య పనులను పరిశీలించారు, గ్రామ ముఖద్వారం లో అవెన్యూ ప్లాంటేషన్‌ ‌చేపట్టాలన్నారు, మండల కేంద్రంలో భక్తుల కొంగు బంగారం అయినా శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వెలసి ఉండడంతో ఈ ప్రాంతాన్ని సుందరీకరణ గా చేయాలని ఆయన అధికారులకు సూచించారు, పట్టణంలో పర్యటిస్తూ ఖాళీ స్థలాల్లో ఉన్న చెత్తను మురికినీటిని పరిశీలిస్తూ స్థల యజమానికి నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ స్థలాన్ని సందర్శించి పరిశీలిస్తూ ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వ భూమిని ఆక్రమించకుండా స్ట్రెంచ్‌ ‌కొట్టాలని, బోర్డు ఏర్పాటు చేయాలని అందులో ప్లాంటేషన్‌ ‌చేపట్టాలన్నారు, దేవాలయ వెనుక భాగంలో అపరిశుభ్రంగా ఉండడంతో గ్రామపంచాయతీ ఆలయ అధికారులపై ఆగ్ర హం వ్యక్తం చేశారు, తక్షణం పారిశుద్ధ్య కార్యక్ర మాలు చేపట్టాలన్నారు, కొబ్బరి బోండాలు, తాటి ముంజలు కటింగ్‌ ‌చేసే మిషన్‌ ‌కొనుగోలు చేయాలని గ్రామ పంచాయతీ అధికారులను ఆదేశించారు, గ్రామస్తులు ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ ‌నిరుపయోగంగా ఉందని లైబ్రరీ గా ఏర్పాటు చేయాలని కోరగా కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు ప్రజల కోరిక మేరకు లైబ్రరీ లో కంప్యూటర్స్ ఏర్పాటు చేయిస్తామని పోటీ పరీక్షల పుస్తకాలు కూడా మంజూరు చేస్తామని కలెక్టర్‌ ‌హామీ ఇచ్చారు, బస్టాండ్‌ ‌ప్రాంతంలో శిధిలమైన భవనాన్ని పరిశీలిస్తూ తక్షణం తొలగించాలని అధికారులకు సూచించారు, చెరువులు కుంటల మరమ్మతులు ఉపాధిహామీ నిధులతో చేపట్టాలని అధికారులకు సూచించారు, తాసిల్దార్‌ ‌కార్యాలయం సందర్శించి పెండింగ్లో ఉన్న భూముల వివరాలను భూమి పట్టా చేయాలని ఎంత మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారని ఆయన తాసిల్దార్‌ ‌విజయ్‌ ‌కుమార్‌ ‌ను అడిగి తెలుసుకున్నారు, త్వరితగతిన పట్టాదారు పాసు పుస్తకాలు రైతులకు అందించే విధంగా చూడాలని ఆయన వారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డి ఈ ఓ సోమశేఖర శర్మ, తాసిల్దార్‌ ‌విజయ్‌ ‌కుమార్‌, ఎం‌పీడీవో ధన్సింగ్‌ ‌నాయక్‌, ఎస్సై జక్కుల శంకర్రావు, సర్పంచ్‌ ‌నూతక్కి పద్మ నరసింహారావు, ఎంపీటీసీ చిన్నం భాస్కర్‌, ఎం‌పిఓ విజయలక్ష్మి, రెవెన్యూ ఇన్స్పెక్టర్‌ ‌జంపయ్య, ఆలయ ఈవో సత్యనారాయణ,పంచాయతీ కార్యదర్శి, విఆర్వోలు, తదితరులు పాల్గొన్నారు,

Leave a Reply