Take a fresh look at your lifestyle.

కెసిఆర్‌ ‌మాటలకు ఉద్యోగులు మోసపోవద్దు

  • సీమాంధ్ర ఓట్ల కోసమే కెటిఆర్‌ ‌విశాఖ స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌పాట
  • మండిపడ్డ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌

తెలంగాణ ప్రజలు మరోసారి మోసపోవద్దు. కేసీఆర్‌, ‌కేటీఆర్‌ ‌లు ఓటర్లను మోసం చేసేందుకు మళ్ళీ కుట్ర చేస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ‌పేర్కొన్నారు. గతంలో కేసీఆర్‌ ‌కుక్క తోకను ఊపుతదా.. తోకను కుక్కను ఊపుతదా అని అన్నారని, ఇప్పుడు అదే కేసీఆర్‌ ఓట్ల కోసం ఉద్యోగ సంఘాలను ఇంటికి పిలిపించుకుని మాట్లాడుతున్నారని, అందువల్ల మోసపోవద్దని హెచ్చరించారు. ఇప్పటికైనా గొర్రెల్లా మోసపోవద్దు.. కొంతమంది నాయకులు పాల ప్యాకెట్లు, పటాకులు జేబులో పెట్టుకొని తిరుగుతితున్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌ను ఓడిస్తే మీ హక్కులు, మీ జీతాలు ఇంటికి వస్తాయని అన్నారు. పీఆర్సీ కేసీఆర్‌ ఇచ్చిన బిక్ష కాదు. అది సహజంగా జరిగే పక్రియ.. అది ఉద్యోగుల హక్కని అన్నారు.

ఆంధప్రదేశ్‌ 27 ‌శాతం ఇస్తే 29 శాతం ఇస్తామని కేసీఆర్‌ ‌ప్రకటించారని అందుకు పాల ప్యాకెట్లు, పాటకులు బ్యాచ్‌ ‌సంబరాలు చేయడం మోసం కాదా ? అని ప్రశ్నించారు. గతంలో 43 శాతం ఇచ్చామని ఇప్పుడు 45 శాతం ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు ఎందుకు డిమాండ్‌ ‌చేయడం లేదని ప్రశ్నించారు. ఇంతకాలం ఈ సమస్యలపై ఎందుకు అడగడం లేదన్నారు. అలాగే కెసిఆర్‌ ఎం‌దుకు నాన్చి ఇప్పుడే మాట్‌ఆడారో గుర్తు చేసుకోవాలన్నారు. ఇప్పటికైనా కేసీఆర్‌ 45 ‌శాతం ఫిట్‌ ‌మెంట్‌ ఇస్తామని చెప్పి ఉద్యోగుల అన్ని రకాల సమస్యల పరిష్కారాలు చేస్తే తాము ఎన్నికల నుంచి తప్పుకుంటామని అన్నారు. ఎన్నికలు రాగానే కేసీఆర్‌ ‌కు అబద్దాలు వస్తాయని, గతంలో ఇలాగే నిరుద్యోగ భృతి ఇస్తామన్న విషయాన్ని శ్రవణ్‌ ‌గుర్తు చేశారు.

గ్రేటర్‌ ఎన్నికలలో వరద బాధితులకు 10 వేల సహాయం ఇస్తామన్నారు. ఇంటింటికి తాగు నీరు ఉచితంగా ఇస్తామన్నారు, అవన్నీ మర్చి పోయారు.. అల్జీమర్స్ ‌రోగిలా కేసీఆర్‌ ‌మారిపోయారని అన్నారు. కేటీఆర్‌ ‌హైదరాబాద్‌ ‌లో మంచి నీళ్ళు కోసం కొట్లాడుకునే వాళ్ళు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అంటున్నారని, కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రభుత్వ హయాంలో కృష్ణ, గోదావరి నదుల నుంచి పుష్కలంగా నీరు అందించి దాహార్తి తీర్చింది కాంగ్రెస్‌ ‌పాలకులని అన్నారు. విద్యుత్‌ ఉద్యోగులను పర్మనెంట్‌ ‌చేసినట్టు కేటీఆర్‌ అబద్దాలు చెప్తున్నారని, తమకు పర్మనెంట్‌ ‌కాలేదని ఇప్పటికే ఇద్దరు విద్యుత్‌ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. కేటీఆర్‌ ఇం‌త పచ్చి అబద్దాలు ఆడుతూ మోసం చేస్తున్నారని అన్నారు.

మండలి ఎన్నికలలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఓడిస్తే వాళ్ళ ప్రభుత్వం ఏమి పడిపోదు, కానీ ఓడిస్తే కేసీఆర్‌, ‌కేటీఆర్‌ ‌ల అబద్దాలు మాని ప్రజలకు ప్రధానంగా నిరుద్యోగులకు, గ్రాడ్యుయేట్లకు న్యాయం జరుగుతుందని అన్నారు. కేటీఆర్‌ ‌మాటలు..ఇంటి పేరు శ్రీగంధం వారు ఇంట్లో గబ్బిలాల వాసన అన్నట్టుగా ఉందని అన్నారు. ఎన్నికల కమిషన్‌ ‌ప్రభుత్వానికి అనుబంధ సంఘంగా మారిపోయిందని, రెండు రోజుల్లో ఎన్నికలు ఉండగా ఇప్పుడు బోగస్‌ ఓట్లపైన విచారణకు ఆదేశాలు ఇచ్చారని అన్నారు. రెండు రోజుల్లో ఏమి విచారణ జరుపుతారు. ఏ చర్యలు తీసుకుంటారు ? అని ఆయన ప్రశ్నించారు. ఒకసారి కాంగ్రెస్‌కు అవకాశమిచ్చి చూడండి ఎలా ప్రశ్నిస్తారో ? ఎలా వి• సమస్యలు పరిష్కారమిస్తారో చూడండని అన్నారు.

ఆంధ్ర సెటిలర్ల ఓట్లు కోసమే విశాఖ ఉక్కు గురించి కేటీఆర్‌ ‌మాట్లాడుతున్నారని, కూట్లో రాయి తీయనోడు ఏట్లో రాయి తీస్తాడట అంటూ ఎద్దేవా చేశారు. ఇక్కడ ఇంట్లో ఉన్న సమస్యలు పరిష్కరించి మిగతావి తర్వాత చూడండన్నారు. కూట్లో రాయి తీయనోడు ఏట్లో రాయి తిస్తా అన్నట్లు ఉంది కేటీఆర్‌ ‌మాటలు ఉన్నాయని ఎద్దేశాచేశారు. నిజాం షుగర్‌ను అమ్ముకున్న వీరు విశాఖ ఉక్కు వి•ద ఉద్యమం చేస్తారా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీని చూస్తేనే టీఆర్‌ఎస్‌ ‌నేతల లాగులు తడుస్తాయని ఆయన ఎద్దేవాచేశారు. వీళ్లు కేంద్రం వి•ద పోరాటం చేస్తాం అంటే సీమాంధ్రులు నమ్మరని, కేటీఆర్‌ ‌మాటలు నమ్మి ఓటు వేయడానికి ఆంధ్ర సెటిలర్లు అమాయకులు కారని చెప్పారు. ఉద్యోగులు ఆత్మ గౌరవంతో ఓటు వేయాలని కోరారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఓడించాలని దాసోజు శ్రావణ్‌ ‌పిలుపునిచ్చారు.

Leave a Reply