- ఎస్ఆర్ అండ్ బిజిఎన్ఆర్ భూముల సేకరణపై జిల్లా మంత్రిస్పందించాలి
- ఖమ్మం కేంద్రంగా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి
- కళాశాల భూములను పరిశీలించిన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
ఖమ్మం జూన్ 27, ప్రజాతంత్ర(ప్రతినిధి): భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఎస్ఆర్ అండ్ బిజిఎన్ఆర్ భూముల పరిశీలన కార్యక్రమానికి ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భాగం హేమం త్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా విద్యాలయాల భూముల ఆక్రమణకు పాల్పడుతుందని అన్నారు. ఖమ్మం జిల్లాకు ఎంతో మంది మేధావులను విద్యా వేత్తలను అందించినటువంటి కళాశాల ఎస్ఆర్ అండ్ బిజిఎన్ఆర్ అని, అలాంటి కళాశాల భూములను ఆక్రమణ చేయాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఖమ్మం జిల్లాలో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవిష్యత్తులో యూనివర్సిటీ గా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. కళాశాల కళాశాల భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. దాత గంటల నారాయణరావు ఈ భూమిని ఈ జిల్లాలోని విద్యార్థుల పురోగతికి ఉపయోగపడేలా విద్యాలయాలకు దానం ఇచ్చారని అలాంటి భూములను ఇతర శాఖలకు కేటాయించడం సరికాదన్నారు. జిల్లాలో విద్యాలయాల భూములను కాపాడుకోవడానికి పెద్ద ఆందోళన జరుగుతున్నప్పటికీ అధికారులు స్పందించక పోవడం శోచనీయమన్నారు. ఈ కళాశాల భూముల సేకరణ విషయంపై జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెంటనే స్పందించాలని కోరారు. కళాశాల కేంద్రంగా యూనివర్సిటీ ఏర్పాటు చేసే దానికి కృషి చేయాలని కోరారు.
ఖమ్మం జిల్లా కేంద్రంగా యూనివ ర్సిటీ ఏర్పాటు, ఎస్ఆర్ అండ్ బిజిఎన్ఆర్ భూములు కేటాయింపుపై భవిష్యత్తులో లో పూర్వ విద్యార్థులు విద్యార్థి సంఘాలు చేయబోయే ఆందోళనలో తాను కూడా భాగస్వామ్యం అవుతానన్నారు. ఈ కళాశాల భూములు కాపాడుకునే దానికి తన వంతు కృషి చేస్తానని, అవసరమైతే పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. కొంతమంది వ్యక్తుల ప్రయోజనాల కోసం ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేయాలని అనుకుంటే ప్రభుత్వా నికి తగదని హెచ్చరించారు. విద్యార్థులు ప్రభుత్వ విద్యా రంగం వైపే మొగ్గుచూపుతున్నారని అలాంటి తరుణంలో ఇలా ఎన్నో అవకాశాలు ఉన్నటు వంటి కళాశాలను బతికించు కోవాల్సిన అవసరం మనందరిపై ఉందన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు మాట్లాడుతూ ఖమ్మం లోని ఎస్ఆర్ అండ్ బిజిఎన్ఆర్• కళాశాల భూములను కాపాడు కునే దానికోసం విద్యార్థి సంఘా ల ఆధ్వర్యంలో అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలకు పిలుపునిస్తామ న్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంగా జనరల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో వి ద్యార్థి సంఘాలు అనేక పోరా టాలు నిర్వహిస్తున్నామని ఇప్ప టికైనా ప్రభుత్వం స్పందించి యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. ఇప్పటికే అనేక రకాల పేర్లతో కళాశాల భూములను ఇతర శాఖలకు కేటాయించా రని, కొంత మంది స్వార్ధ ప్రయో జనాల కోసం కళాశాల భూముల ను ఆక్రమిం చుకోవాలని చూస్తే ఊరుకోమ న్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎ ఫ్ఐ జిల్లా అధ్య క్షులు జమ్మి అశోక్, యు టిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నెల్లూరు వీరబాబు, దుర్గాభవాని, ఏఐఎ స్ఎఫ్ జిల్లా కార్యదర్శి రామకృష్ణ, ఏఐఎల్ యు రాష్ట్ర కార్యదర్శి కొల్లి సత్య నారాయణ, పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు జక్కంపూడి నాగేశ్వరరావు, ప్రైవేటు లెక్చరర్స్ అసోసియేషన్ నాయకులు కొప్పి శెట్టి సురేష్, ఎస్ఎఫ్ఐ కార్యద ర్శి ప్రవీణ్, నాయ కులు రాజేష్, ప్రసన్న, పిడిఎ స్యు వెంకటేష్ మస్తాన్ పాల్గొన్నారు.