Take a fresh look at your lifestyle.

ధాన్యం కొనకుండా ధర్నాలు చేస్తారా?

  • ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కెసిఆర్‌
  • ఎంఎల్‌ఏ ఈటల

రాష్ట్రంలో ధాన్యం తడిచి రైతుల కళ్లల్లో కన్నీరే మిగిలిందని హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. రైతులు చనిపోతుంటే కేసీఆర్‌ ‌ప్రభుత్వం నిమ్మకు నీరేత్తనట్లు వ్యవహరిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కేసీఆర్‌ ఈ ‌రోజు ధర్నా చేపట్టి..తన వైఫల్యాలను కేంద్రంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్‌ ‌భాషను చూసి తెలంగాణ సమాజం అసహ్యించుకుంటుంది.

రైతులు కష్టపడి పండిస్తే..క్వింటా ధాన్యంపై 8 నుంచి 12 కిలోలు కట్‌ ‌చేస్తున్నారు. నాకే అన్నీ తెలుసని కేసీఆర్‌ ‌భావిస్తున్నారు. రైతుల మరణాలకు పూర్తి బాధ్యత కేసీఆర్‌ ‌తీసుకోవాలన్నారు. ధర్నా చౌక్‌ ‌వద్దంటూ ఎత్తేసిన కెసిఆర్‌ ఇప్పు‌డు అక్కడే ధర్నాకు దిగడం సిగ్గుచేటని అన్నారు.  కేసీఆర్‌ ‌తన కీర్తి కోసం తప్ప ప్రజల కోసం పని చేయడు. ధర్నా చౌక్‌లో ఎవరి వి•ద వి• ధర్నా..నీ పతనం ఆరంభమైంది.

హుజురాబాద్‌ ‌ఫలితాన్ని డైవర్ట్ ‌చేయడానికి కేసీఆర్‌ ఈ ‌డ్రామాలు ఆడుతున్నాడు’ అని ఈటల రాజేందర్‌ అన్నారు. రైతులపై ప్రేమ ఉంటే వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేయాలన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టి రాజకీయాలు మానుకోవాలన్నారు.

Leave a Reply