Take a fresh look at your lifestyle.

కనకపురలో డికె శివకుమార్‌ ‌విజయం

  • వరుసగా నాలుగోసారి విజయదుందుభి
  • రెబల్స్‌ను దువ్వే పనిలో శివకుమార్‌

బెంగళూరు,మే13 : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్నాయి. కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థులు 123 స్థానాల్లో తమ ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ‌విజయం సాధించారు. ఆయన కనకపుర నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అక్కడి నుంచి ఆయన వరసగా నాలుగోసారి గెలిచారు.కాంగ్రెస్‌ ‌విజయానికి అడుగుదూరంలో ఉండటంతో దేశవ్యాప్తంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు జోష్‌లో ఉన్నారు. ఇదిలావుంటే అవసరమైతే మద్దతు కూడగట్టేందుకు శివకుమార్‌ ‌రంగంలోకి దిగారు రెబల్‌స్త్ఓ ‌చర్చలు జరుపుతున్నారు.

కాంగ్రెస్‌ ‌నుంచి బయటకి వెళ్లి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన వారు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో లీడ్‌ ‌లో ఉన్నారు.  వారిని సొంతగూటికి రప్పించాలని చూస్తున్నారు. వారితో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అయిదుగురు రెబల్స్‌తో టచ్‌ ‌లో ఉన్నట్లు తెలుస్తోంది. శివకుమార్‌ ‌డియాతో మాట్లాడుతూ.. మత రాజకీయాలు కర్ణాటకలో పని చేయవని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణెళి ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ అని శివకుమార్‌ అన్నారు. బీజేపీకి ప్రజలు గుణపాఠం చెబుతున్నారన్నారు. సొంతంగానే అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply