Take a fresh look at your lifestyle.

జాతి గర్వించదగిన ఉద్యమ దివిటి జయశంకర్

తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు
తెలంగాణ జాతి గర్వించదగిన ఉద్యమ దివిటి అచార్య జయశంకర్ రని తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు కొనియాడారు.ఆదివారం ప్రొపెసర్ జయశంకర్ 9 వ వర్దంతి సందర్భంగా తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్వర్యంలో నల్లగొండ లో జయశంకర్ విగ్రహాన్ని కి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా టివివి జిల్లా అధ్యక్షులు సైదులు మాట్లాడుతూ తన జీవిత కాలం మొత్తం తెలంగాణ సమాజానికే ధారపోసిన మహానీయుడు జయశంకర్ అన్నారు. అడుగడుగున సీమాంధ్ర ఆధిపత్యాన్ని, వారి అన్యాయాలను, ఆగడాలను నిలదీసిన సార్ సాహాసం మరువలేనిదన్నారు.ఆరుదశాబ్దాల ఉద్యమానికి సజీవ సాక్షిగా ఉండి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నమ్ముకున్న సిద్దాంతం కోసం అవిశ్రాంతంగా పనిచేసారన్నారు. జయశంకర్ సార్ ఎత్తిపట్టిన ఉద్యమ ఆకాంక్ష లు స్వరాష్ట్రంలో అమలుకాకపోవడం ఉద్యమ స్పూర్తికి విరుద్దమన్నారు. జయశంకర్ గారు ప్రజా సంఘాలను  సమాజాన్ని కి ప్రాణంగా భావించిన వాటిని  స్వరాష్ట్ర పాలకులు ఉక్కుపాదం తో అణచివేయడం జయశంకర్ సార్ వెలిబుచ్చిన ప్రజాస్వామిక ఆకాంక్ష లకు విరుద్ధమన్నారు.
జయశంకర్ సార్ ను “తెలంగాణ జాతిపిత”గా కూడా అంగీకరించడానికి ఉద్యమ పార్టీ గా చెప్పుకునే టి.ఆర్.స్ పార్టీ అంగీకరించకపోవడం జయశంకర్ అలోచనల పట్ల వీరికి ఎంత చిత్తశుద్ధి వుందో అర్థమవుతుందన్నారు. సమైక్య శక్తులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి స్వయంప్రకటిత జాతి పితగా ప్రచారం చేసుకోవడం నియంతృత్వ విధానాలకు పరాకాష్ఠ అన్నారు.జయశంకర్ ఆకాంక్షించిన ప్రజాస్వామిక తెలంగాణ కోసం తెలంగాణ విద్యావంతుల వేదిక ఉద్య మిస్తుంది .. సార్ ను స్మరించుకోవడమంటే ఉద్యమ ఆకాంక్షలను నెమరువేసుకొని భవిష్యత్ పోరాటాలకు సంసిద్దులు కావడమే అన్నారు. ఈ వర్దంతి కార్యక్రమంలో టివివి నాయకులు వి.కొండల్,గిరి,మహేష్, గణేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply