- ఇంచార్జి సిపి శ్వేతారెడ్డి వెల్లడి
- కేసును ఛేదించిన పోలీసులకు అభినందన
గజ్వేల్‌లో బ్యాంకు ఉద్యోగి దివ్యను హత్య2చేసిన నిందితుడు వెంకటేష్‌ను అరెస్టు చేసి, కోర్టుకు రిమాండ్ చేసినట్లు సిద్దిపేట ఇంచార్జి పోలీసు కమిషనర్ శ్వేతా బసు తెలిపారు. ఈ మేరకు గురువారం సిద్దిపేటలో మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాల ప్రకారం… ఈ నెల 18న దివ్య తండ్రి లక్ష్మీరాజ్యం గజ్వేల్ పోలీస్ స్టేషన్ కు వచ్చి తన కూతురు దివ్య ను గతకొన్ని రోజుల నుండి వేములవాడ పట్టణానికి చెందిన వెంకటేష్ ప్రేమిస్తున్నానని వేధిస్తున్నాడు. దివ్యను వెంకటేశ్ చంపి ఉండవచ్చని అనుమానం ఉన్నదని దరఖాస్తు ఇవ్వగా గజ్వేల్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఇంచార్జి సిపి తెలిపారు. ఫిర్యాదు మేరకుకేసు దర్యాప్తు గురించి ఏసీపీ నారాయణ ఆధ్వర్యంలో 5 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి బుధవారం రాత్రి వేములవాడ పట్టణంలో స్పెషల్ టీమ్స్ అధికారులు వెంకటేష్ ను అదుపులోకి తీసుకుని విచారించగా తనే దివ్యను హత్య చేసినానని అని ఒప్పుకున్నాడన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన దివ్య. మరియు వేములవాడ పట్టణానికి చెందిన వెంకటేష్ ఇద్దరు కలిసి 9, 10వ తరగతి ఒకే స్కూల్లో చదువుకున్నారు. దివ్య, వెంకటేష్ పై చదువులు చదువుకునే సమయంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అమ్మాయి బ్యాంక్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ సమయంలో ఆమెను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుందామని వెంబడి పడేవాడన్నారు. దివ్య 5 నెలల నుండి గజ్వేల్ ఏపీజివిబి బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న అప్పటినుండి నిందితునికి దూరం పెడుతుండటం వల్ల మనసులో కక్ష పెంచుకున్నాడు. ఇదే సమయంలో దివ్య వేరే అబ్బాయితో చనువుగా ఉంటుందని తెలిసిన నిందితుడు.
నాకు దక్కనిది, మరెవరికీ దక్కకూడదని, చంపాలని నిర్ణయించుకొని, దివ్య ఉద్యోగం చేస్తున్నా గజ్వేల్ బ్యాంకు వద్దకు మరియు ఆమె ఉంటున్న ఇంటి వద్దకు పలుమార్లు వచ్చి వెళ్ళాడు. ఈ నెల 18న రాత్రి అందాజ 7:45 గంటల సమయమున దివ్య బ్యాంకు నుండి ఒంటరిగా ఇంటికి వెళుతున్నది గమనించి, ఇంటిలో దివ్య తల్లిదండ్రులు లేనిది చూసి, డాబా పై ఆరవేసిన బట్టలు తీసుకుంటుండగా నిందితుడు తన బ్యాగులో దివ్యని చంపడం కోసం తెచ్చుకున్న కత్తి తీసి దివ్య గొంతుపై, ఇతర భాగాలపై పొడిచి హత్య చేసినట్లు సిపి తెలిపారుహత్య చేసిన వెంకటేష్అక్కడ నుండి నేరుగా సికింద్రాబాద్ నుండి రైలులో విజయవాడకు, అక్కడ నుండి వరంగల్ మీదుగా వేములవాడకు రాగా నిందితుల్ని అదుపులోకి తీసుకొని విచారించగా తనే దివ్యను కత్తితో పొడిచి హత్య చేసినానని ఒప్పుకున్నందుకు అరెస్టు చేసి జుడిషియల్ రిమాండ్‌కు పంపించడం జరిగిందన్నారు.నిందితునికి కఠిన శిక్ష పడటం కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం జరుగుతుందని ఇంచార్జి పోలీస్ కమిషనర్ శ్వేతా రెడ్డి తెలిపారు. కాగా, 24 గంటల్లో కేసు చేధించిన గజ్వేల్ ఏసిపి నారాయణ, గజ్వేల్ సిఐ ఆంజనేయులు, సీఐ మధుసూదన్ రెడ్డి, సిబ్బందిని ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత అభినందించారు.