Take a fresh look at your lifestyle.

అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

district-sp-rema-rajeswari-arrested-ganja-smuglers
అంతర్ రాష్ట్ర గంజాయి ముఠాను  అరెస్టు చేసిన మహబూబ్నగర్ పోలీసులు వారి వద్ద నుండి 150 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ 21 లక్షలు. నిందితులను గురువారం మీడియా ఎదుట హాజరుపరిచిన జిల్లా ఎస్పీ రెమా  రాజేశ్వరి కేసుకు సంబంధించిన వివరాలు తెలియజేసారు . ఈనెల 4వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాటికొండ స్టేజ్ వద్ద కారు లారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదాన్ని తెలుసుకున్న పోలీసులు వాహనం వద్దకు వెళ్లి పరిశీలిస్తే వాహనంలో గంజాయి తరలిస్తున్నట్లు గా తేలడంతో జిల్లా ఎస్పీ
 రెమా రాజేశ్వరి ఈ విషయాన్ని తెలుసుకుని ఇందుకు సంబంధించి కేసును లోతుగా విచారణ చేయాలని ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా భూత్పురు  పోలీస్ స్టేషన్ సిఐ పోలీస్ సిబ్బంది సాహసోపేతంగా విచారణ చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ వైజాగ్ ప్రాంతానికి చెందిన పీలేరు నుండి మధురై మీదుగా రామేశ్వరం అక్కడినుండి షిఫ్ట్ షిప్ ద్వారా గంజాయిని శ్రీలంకకు తరలిస్తున్నట్లు గా తేలిందని ఎస్పీ వెల్లడించారు ఈ ముఠా వెనకాల బలమయిన  శక్తి ఉందని మరింత లోతుగా విచారణ చేయాలని ఎస్పి ఆదేశించడంతో కేసులు ప్రత్యేక బృందం మరింత వేగం పెంచి తమిళనాడు వాస్తవ్యులైన ఇటువంటి వ్యక్తులు వెళ్దాం నడుపుతున్నారు తేలిందని ఎస్పీ వెల్లడించారు  హైదరాబాద్ లో ఉన్న పూస దాబా దగ్గర గంజాయి అక్రమ వ్యాపారం వ్యాపారులు కలిసే స్థావరం తెలుసుకొని ఒక్కసారిగా దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామన్నారు. అంతర్రాష్ట్ర గంజాయి ముఠా పట్టుకున్నందుకు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి భూత్పూర్ సిఐ తో పాటు ప్రత్యేక బృందాన్ని అభినందించారు .
Tags rema rajeswari, district sp, drug smugglers, hyderabad

Leave a Reply