Take a fresh look at your lifestyle.

జిల్లాను హరితవనంగా మార్చాలి : కలెక్టర్‌

సూర్యాపేట, జూన్‌ 6, ‌ప్రజాతంత్ర ప్రతినిధి): జిల్లాలో హరితహార కార్యక్రమాన్ని ఈ నెల 20 నుండి చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్‌ ‌టి. విన య్‌ ‌కృష్ణారెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్‌ ‌సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులు, మండల ప్రత్యేక అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 6 విడత హరితహారం కార్యక్రమంలో జిల్లాలో 70లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్దం చేయడం జరిగిందని, ఈ నెల 19వరకు ఉపాధి హామీ ద్వారా మొక్కలు నాటేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లా గ్రామీణాభివృద్ది ద్వారా 52లక్షలకు పైగా, అటవీ శాఖ ద్వారా 23లక్షల మొక్కలు సిద్దం చేసినట్లు పేర్కొన్నారు.

ఈత, ఖర్జూర మొక్కలను చెరువు గట్టులపై నాటాలని జిల్లా ఎక్సైయిజ్‌ అధికారులకు సూచించారు. జిల్లాలో అటవీ శాతం తక్కువగా ఉన్నందున నిర్ధేశించిన అన్ని ప్రాంతాల్లో మొక్కలు విరివిరిగా నాటాలని తెలిపారు. ప్రజలను, ప్రజాప్రతినిధులను హరితహారం కార్యక్రమంలో భాగస్వాములు చేయాలన్నారు. మొక్కల సంరక్షణకు ఆయా గ్రామ పంచాయతీలు బాధ్యత వహించాలని, జిల్లాలో అర్‌ అం‌డ్‌ ‌బి రోడ్లకు ఇరువైపులా సూచించిన విధంగా మొక్కలు నాటాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ జిఎస్‌ ‌పనుల్లో నిర్లక్ష్యం చూపరాదని, అట్టివారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆర్డిఓ మోహన్‌రావు, జెడ్పిసిఈఓ విజయలక్ష్మి, ముఖుంద రెడ్డి, పిడి కిరణ్‌కుమార్‌, ‌ప్రత్యేక అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply