Take a fresh look at your lifestyle.

జిల్లా సిబ్బందికి మాస్కులు పంపిణీ కలెక్టర్‌ ‌రవికి అందజేసిన జిల్లా సమాఖ్య ప్రతినిధులు

దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోన వైరస్‌ ‌నియంత్రణ లో బాగంగా అహర్నిశలు విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి జిల్లా అంతటా 10 వేల మాస్కులను జిల్లా సమాఖ్య ప్రతినిధులు పంపిణీ చేసి వారి ఔదార్యన్నీ చాటారు. ఇందులో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టర్‌ ‌రవితో పాటు కార్యాలయ అధికారులకు ,సిబ్బంది కి జిల్లా మహిళ సంఘాల ప్రతినిధులు ,ఏ పి ఎం లు ఆదనపు కలెక్టర్‌ ‌రాజేశం ,డిఆర్డీఏ పిడి లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో అందించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ ‌మాట్లాడుతూ కరోన వైరసను నియంత్రణ కు ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు ఇంట్లో ఉంది సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు తప్పక పెట్టుకోవాలి అని అన్నారు .ఇప్పుడు ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో మాస్కులు ప్రతి ఒక్కరికి తప్పని సరి అవసరం అని తెలుసుకొని ముఖ్యంగా జిల్లాలో అన్ని శాఖల అధికారులు సిబ్బంది కరోన కోవిడ్‌ 19 ‌నిర్ములించే విషయంలో విధులు నిర్వహిస్తున్న వారి భద్రతకు జిల్లా మహిళ సమాఖ్య ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేయడం అభినందనీయం అని కొనియాడారు.

Leave a Reply