Take a fresh look at your lifestyle.

కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు

అత్యాధునిక వైద్య సౌకర్యాలతో జిల్లా ఆసుపత్రి : ఎక్సైజ్‌ ‌శాఖ మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌, ‌జూన్‌ 26 (‌ప్రజాతంత్ర ప్రతినిధి) : విద్య వైద్యం ప్రతి ఒక్కరికి అవసరమనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని రంగాల పై దృష్టి పెడుతున్నారని గత పాలకుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఆసుపత్రులు వైద్య సదుపాయాలు సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బంది పడ్డారని నేడు తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా రూపుదిద్దు కుంటున్నాయి అని ఎక్సైజ్‌ ‌శాఖ మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ అన్నారు శుక్రవారం ఆయన మహబూబ్నగర్‌ ‌జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో 20 యూనిట్ల ఇంటెన్సివ్‌ ‌కేర్‌ ‌యూనిట్‌ ‌ను ప్రారంభించారు. భవిష్యత్తులో ఉమ్మడి మహబూబ్నగర్‌ ‌జిల్లా వాసులు వైద్యం కోసం హైదరాబాదు లాంటి మహా నగరాలకు వెళ్లకుండా మహబూబ్నగర్లో లోనే అత్యాధునిక వైద్య సౌకర్యాలను కల్పిస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్‌ ,‌క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్‌ ‌వి. శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌తెలిపారు. గతంలో జిల్లా ఆస్పత్రిలో కేవలం 18 మంది డాక్టర్లు, 70 మంది నర్సులు మాత్రమే ఉండే వారని, ఇప్పుడు ఆ సంఖ్య 200 మంది డాక్టర్లు, 500 మంది నర్సులకు పెరిగిందని, అంతేకాక ల్యాబ్‌ ‌టెక్నీషియన్లు, సిబ్బంది, 24 గంటలు వైద్యం అందుబాటులో ఉండేలా వైద్యులు, సూపరిండెంట్‌, అధికారులను నియమించడం జరిగిందని, సాధారణ రోగాలకు చికిత్స తో పాటు, క్యాన్సర్‌ ‌వంటి వాటికి కూడా చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

మహబూబ్నగర్‌ ‌ప్రభుత్వ వైద్య కళాశాలలో 475 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయని, భవిష్యత్తులో జిల్లా ప్రజలు ఎవరు కూడా వైద్యం కోసం హైదరాబాద్కు వెళ్లాల్సిన పని లేకుండా మహబూబ్నగర్లోనే అత్యాధునిక సౌకర్యాలతో చికిత్స అందే ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి అన్నారు. ఇతర జిల్లాల నుంచి కూడా మహబూబ్‌ ‌నగర్‌ ‌కి వచ్చి వైద్యం చేయించుకునే సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు .అయితే జిల్లా ప్రధాన ఆసుపత్రి తో పాటు మెడికల్‌ ‌కళాశాలలో కూడా ఎలాంటి ఇబ్బందులు,కొరత రాకుండా చూడాలని, ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎవరు కూడా నిర్లక్ష్యం వహించరాదని, విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఉస్మానియా, ఆస్పత్రి గాంధీ ఆస్పత్రిలో కన్నా మెరుగైన వైద్య సేవలను మహబూబ్నగర్‌ ‌ప్రభుత్వ వైద్యశాలలో కల్పిస్తున్నా మని ఆయన తెలిపారు.

ప్రస్తుతం మహబూబ్నగర్‌ ‌ప్రభుత్వ ఆసుపత్రిలో 900 పడకలు,30 ఐ సియ యూనిట్లు ఉన్నాయని, అందువల్ల ప్రజలు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా కరోనా సమయంలో కూడా పేద ప్రజలు ఇబ్బంది పడకుండా అవసరమైన వెంటిలేటర్లు వంటివి కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌స్వర్ణ సుధాకర్‌ ‌రెడ్డి , అదనపు కలెక్టర్‌ ‌మోహన్లాల్‌ ,‌మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌నరసింహులు, రెడ్‌ ‌క్రాస్‌ ‌సొసైటీ అధ్యక్షులు లయన్‌ ‌నటరాజ్‌, ‌కౌన్సిలర్లు, ఆస్పత్రి కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!