Take a fresh look at your lifestyle.

అక్టోబర్‌ ‌కల్లా రైతు వేదికలు పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్‌ ‌షేక్‌ ‌యాస్మిన్‌ ‌బాష

వనపర్తి,జులై,28(ప్రజాతంత్ర విలేకరి) : వనపర్తి జిల్లా లో అక్టోబర్‌ ‌కు ముందే రైతు వేదికల నిర్మాణాలను పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్‌ ‌షేక్‌ ‌యాస్మిన్‌ ‌బాష తెలిపారు. మంగళవారం ఆమె వనపర్తి మండలం నాగవరం, కొత్తకోట మండలం పాలెం, కనిమెట్ట క్లస్టర్లలో నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కనిమెట్ట వద్ద విలేకరులతో మాట్లాడుతు రైతులకు ఒక వేదిక కల్పించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణాలను చేపట్టిందని, వీటి ద్వారా రైతు సమస్యలను పరిష్కరించు కోవడంతో పాటు వ్యవసాయానికి సంబంధించిన విస్తరణ కార్యక్రమాలను సులభంగా రైతులకు అందించేందుకు ఈ వేదికలు ఉపయోగపడతాయని తెలిపారు.జిల్లాలో అన్ని క్లస్టర్లలో రైతు వేదికలు నిర్మిస్తున్నామని, పనులన్నీ చకచక జరుగుతున్నాయని తెలిపారు.

ఉపాధి హామీ పంచాయతీరాజ్‌ ఆర్‌అం‌డ్బీ, ఏజెన్సీలు ప్రజా ర్రతినిధులు, రైతుబంధు కో ఆర్డినేటర్ల సమన్వయంతో రైతు వేదికల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేఞదుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ముఖ్యంగా స్థానిక సర్పంచ్‌, ‌ప్రజాప్రతి నిధులతో పాటు అధికారులు కూడా ఉత్సాహంతో రైతు వేదికల నిర్మాణాల పూర్తి కృషి చేస్తున్నారని అన్నారు. జిల్లాలోని మొత్తం 71 రైతువేదికల నిర్మాణాలు మొదలయ్యాయని, 3 వేదికలు దాతల సహకారంతో నిర్మిస్తుండగా, తక్కిన 68 ఉపాధి హామి ద్వారా నిర్మించడం జరుగుతున్నదని వెల్లడించారు.రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్‌ 10 ‌నాటికి రైతు వేదికల నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసిందని అయితే నిర్దేశించిన సమయానికి ముందే రైతు వేదికలను పూర్తి చేసేందుకు జిల్లాలోని ప్రజాప్రతినిధులు అధికారులు ముందుకు వచ్చారని ఆమె వెల్లడించారు. అనంతరం మోడెర్ల ఉద్యాన కళాశాలలో ప్లాంటేషన్‌ ‌ను జిల్లా కలెక్టర్‌ ‌తనిఖీ చేశారు. అంతేకాక రాజరాజేశ్వరి ఇండస్ట్రీస్‌లో మొక్కలు నాటారు. జిల్లా కలెక్టర్‌ ‌వెంట కొత్తకోట ఎంపిపి గుంత మౌనిక, జిల్లా పరిషత్‌ ‌వైస్‌ ‌చైర్మెన్‌ ‌వామన్‌ ‌గౌడ్‌, ‌తహసిల్దార్‌ ‌తదితరులు ఉన్నారు.

Leave a Reply

error: Content is protected !!