Take a fresh look at your lifestyle.

మండలాల్లో హెల్త్ ‌సర్వేలు నిర్వహించాలి

జిల్లా పాలనాధికారి సందీప్‌  ‌కుమార్‌ ‌ఝూ

రెబ్బెన, సెప్టెంబర్‌ 3, (‌ప్రజాతంత్ర విలేఖరి) : కరోనా వైరస్‌ ‌వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా సంబంధిత అధికారులతో జిల్లా పాలనాధికారి సందీప్‌ ‌కుమార్‌ ‌ఝూ గురువారం నాడు జిల్లా పాలనాధికారి సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మండలాల్లో హెల్త్ ‌సర్వేలు నిర్వహించాలని ప్రతి రోజు హెల్త్ ‌సిబ్బంది తో టెలీకన్ఫరెన్స్ ‌నిర్వహించి జ్వర పీడితుల వివరాలను తెలుసుకొని రిపోర్ట్ ‌సమర్పించాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు.
భట్‌పల్లి, అశోక్‌ ‌నగర్‌, ‌నవేగాం బస్తి, పెంచికల్‌ ‌పేట్‌ ‌లలో రాపిడ్‌ ‌టెస్టులు చేయాలన్నారు. గోలేటి క్వారన్‌ ‌టైన్‌ ‌సెంటర్‌ ‌లో 18, సింగరేణి ఐసోలేషన్‌ ‌లో 12, వాంకిడి క్వారన్‌ ‌టైన్‌ ‌సెంటర్‌లో 47, సాంఘీక గురుకుల పాఠశాలలో 69, పి.హెచ్‌.‌సీ ఆసిఫాబాద్‌ ‌లో 60, కాగజ్‌ ‌నగర్‌ ‌పోస్ట్ ‌మెట్రిక్‌ ‌గర్లస్ ‌లో 50, మొత్తం 256 మంది కోవిడ్‌ అనుమానితులు ఉన్నారని తెలిపారు. ఇప్పటి వరకు 9697 శాంపిల్స్ ‌ని గాంధీ హాస్పిటల్‌ ‌హైదరాబాద్‌ ‌కు పంపించగా అందులో 763 మందికి పాజిటివ్‌ ‌గా నిర్ధారించడం జరిగిందని, 8885 మందికి నెటిస్‌ ‌వచ్చిందని, 49 మంది రిసల్ట్ ‌రావాల్సి ఉందని అన్నారు. ఈ సమావేశంలో అదనపు జిల్లా పాలనాధికారి డా,, రాంబాబు, జిల్లా రెవిన్యూ అధికారి సురేష్‌, ‌జిల్లా వైద్యాధికారి కుమ్రం బాలు, ఎస్‌ ఐ ‌వెంకన్న, సూపర్డింట్‌ ‌కాత్యాయిని, యం.డి.స్వామి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply