Take a fresh look at your lifestyle.

పాఠశాలలకు ఏక రూప దుస్తుల పంపిణీ

నంగునూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే ఏక రూప దుస్తులను • మండల విద్య అధికారి తగిరెడ్డి దేశిరెడ్డి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందచేశారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ…కొరోనా వ్యాధి నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకుని పంపిణీ చేయాలని సూచించారు.

విద్యార్థులు కరోనా వల్ల విద్య సంత్సరం నష్ట పోకుండా చూసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌లో టిస్యాట్‌, ‌దూరదర్శన్‌ ‌యాదగిరి టివి ఛానళ్ల ద్వారా తరగతులు నిర్వహించడం జరుగుతుందని, ఉపాద్యాయులు విద్యార్థులు ఆన్‌లైన్‌లో  చూసే విధంగా పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శనిగరం కనకయ్య, సంగు రామకృష్ణ, దేవులపల్లి నర్సింలు, సిఆర్పీ పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!