Take a fresh look at your lifestyle.

నోట్‌ ‌బుక్స్, ‌బట్టలు పంపిణీ

నర్సంపేట, మే 20, (ప్రజాతంత్ర విలేకరి) : మాతృభూమి చారిటబుల్‌ ‌ట్రస్ట్, ‌సంజీవిని ఆశ్రమంలోని విద్యార్థులకు నోట్‌ ‌బుక్స్, ‌పెన్నులు, పెన్సిళ్లు ,బట్టలు, చాక్లెట్స్ ‌నర్సంపేట పట్టణ సీఐ కరుణసాగర్‌ ‌రెడ్డి పంపిణీ చేశారు. బుదవారం ఇండియన్‌ ‌రెడ్‌ ‌క్రాస్‌ ‌సొసైటీ వరంగల్‌ ‌రూరల్‌ ‌జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు పాలక మండలి సభ్యులు నాడెం శాంతికుమార్‌, ‌వరంగల్‌ ‌యూత్‌ ‌రెడ్క్రాస్‌ ‌సభ్యులు దాతృత్వంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ కరుణసాగర్‌ ‌రెడ్డి మాట్లాడుతూ కరోనా పట్ల ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తుందని, ప్రజలు సహకరించి మాస్కులు కట్టుకుని, ఇళ్లలోనుంచి బయటకు రావాలని కోరారు. యూత్‌ ‌రెడ్క్రాస్‌ ‌సొసైటీ వాలెంటర్లు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయం అన్నారు. మానవత దృక్పథంతో రక్తదానానికి దాతలు ముందుకు వచ్చి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమం నిర్వాహకులు డాక్టర్‌ ‌మోహనరావు, యూత్‌ ‌రెడ్‌ ‌క్రాస్‌ ‌వాలెట్స్ ‌స్వాతిక, నిమ్మగడ్డ అఖిల్‌, ‌మాగంటి శ్రీజ, అక్షయ్‌, అక్షిత, శ్రీయ, సూర్య, సారికా, సుర్జీత్‌, ‌సుప్రియ ,యోగేష్‌, ‌సంయుక్త, లైఫ్‌ ‌మెంబర్స్ ‌వేల్పుల సాంబయ్య, గట్టు ఆనంద్‌, ‌భేతి భాస్కర్‌, ‌నాడెం శ్రీనివాస్‌ ‌పాల్గొన్నారు.

Leave a Reply