- 17,178.21 టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సప్లై
- రాష్ట్ర ఎంపిల ప్రశ్నలకు కేంద్ర మంత్రుల లిఖితపూర్వక సమాధానం
గడిచిన ఆరేళ్లలో ముద్ర యోజన స్కీమ్ కింద తెలంగాణలో 47,26,819 మంది ఖాతాలకు 38,114 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ముద్ర స్కీమ్‌లోని వివిధ పథకాల ద్వారా ఈ రుణాలు ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కారడ్ తెలిపారు. ఇందులో శిశు స్కీమ్ కింద రూ. 50వేల చొప్పున 37,46,740 మంది ఖాతాల్లో 9, 730 కోట్లు, కిషోర్ స్కీమ్ కింద 50 వేల నుంచి 5 లక్షల వరకు 7,94,193 మంది ఖాతాల్లో 15,434 కోట్లు, తరుణ్ స్కీమ్ కింద 5 లక్షల నుంచి 10 లక్షలలోపు 1,85,886 అకౌంట్లలో 12,950 కోట్లు రుణాలు ఇచ్చినట్లు ఎంపి బండి సంజయ్ ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తయారీ, ట్రేడింగ్, సేవలు, వ్యవసాయ రంగాల్లో ఇన్ కం జనరేటింగ్ యాక్టివిటీస్‌లో ప్రధాన మంత్రి ముద్ర యోజన(పిఎంఎంవై) కింద నిధుల్ని ఇస్తున్నట్లు తెలిపారు.
గడిచిన ఐదేళ్లలో ఎన్సీఎల్పీ కింద1,686 మందికి పునారావాసం
గడిచిన ఐదేళ్లలో నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్(ఎన్‌సిఎల్‌పి) కింద తెలంగాణలో 1,686 మంది పిల్లలకు రెస్క్యూ/ విత్ డ్రా ఫ్రమ్ వర్క్, రిహాబిలిటేషన్ చేసినట్లు కేంద్రం తెలిపింది. ఇందులో 2020-21లో ఇప్పటి వరకు 300 మంది పిల్లలకు పునరావాసం కల్పించినట్లు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి తెలిపారు. కొరోనా ప్రభావంతో తల్లిదండ్రులకు ఉద్యోగాలు దొరకకపోవడం, పిల్లలకు స్కూల్స్ లేకపోవడంతో చిన్నారులు బాల కార్మికులుగా మారే ప్రమాదం ఉందని ఎంపిలు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, మన్నె శ్రీనివాస్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డిలు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వక జవాబు ఇచ్చారు. కోవిడ్ 19 అన్ని వర్గాలతో పాటూ, పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని తెలిపారు. వివిధ సామాజిక ఆర్థిక సమస్యల కారణంగా చిన్నారులు దేశంలో చైల్డ్ లేబర్ గా మారుతున్నట్లు చెప్పారు. చైల్డ్ లేబర్ నిర్మూలన కోసం చట్టపర చర్యలు, ప్రాజెక్ట్ -ఆధారిత పునరావాసం, సార్వత్రిక ప్రాథమిక విద్యపై దృష్టి పెట్టడం కోసం కేంద్రం ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని అనుసరిస్తుందని సమాధానం ఇచ్చారు.
కోవిడ్ రిలీఫ్ ఆపరేషన్ కింద రాష్ట్రానికి 628.60 కోట్లు
కోవిడ్ రిలీఫ్ చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్(ఎస్టీడిఆర్ఎఫ్) కింద 628.60 కోట్లను ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. అలాగే, నేషనల్ హెల్త్ మిషన్ అమలు కోసం గ్రాంట్స్ ఇన్ ఏయిడ్ రూపంలో మరో 431.17 కోట్లు విడుదల చేసినట్లు తెలిపింది. 2020-21, 2021-22 ఫైనాన్షియల్ ఇయర్‌కి గానూ కేంద్రం వాటా కింద ఈ నిధుల్ని విడుదల చేసినట్లు తెలిపింది. మార్చి 14, 2020లో జరిగిన మీటింగ్‌లో కేంద్రం కొరోనాను జాతీయ విపత్తుగా గుర్తించి, రాష్ట్రాలకు ఎస్టీడిఆర్ఎఫ్ ద్వారా సహకారాం అందించాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకసజ్ చౌదరి తెలిపారు. ఇందులో భాగంగా 2020-21 కింద 449 కోట్లు, 2021-22 ఈయర్‌లో ఫస్ట్ ఫస్ట్ ఇనిస్టాల్మెంట్ కింద 179.60 కోట్లు రాష్ట్రానికి విడుదల చేసినట్లు ఎంపి ఉత్తమ్ ప్రశ్నకు లిఖితపూర్వక జవాబు ఇచ్చారు. అలాగే, 2020-21 ఆర్థిక సంవత్సరంలో నేషనల్ హెల్త్ మిషన్(ఎన్ హెచ్ఎం) కింద కోవిడ్ 19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టం ప్రిపేర్డ్ ప్యాకేజీ లో భాగంగా 8, 257. 88 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి సమాధానంలో పొందుపరిచారు. ఇందులో హెల్త్ వర్కర్స్ బీమా కోసం 110.60 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అంతే కాకుండా, 2019-20 సంవత్సరంలో రాష్ట్రాలకు అందించిన 1113.21 కోట్లు అదనమని పేర్కొన్నారు. 2021-22 ఏడాదికి గానూ కోవిడ్ 19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టం ప్రిపేర్డ్ ప్యాకేజీ ఫేజ్- 2 కోసం రూ .23,123 కోట్ల మొత్తాన్ని కేబినెట్ ఆమోదించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
17,178.21 టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సప్లై
ఈ ఏడాది ఏప్రిల్-జూలై(కొరోనా సెకండ్ వేవ్ టైం) మధ్య తెలంగాణకు 17,178.21 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్(ఎల్ఎంఓ)ను సరఫరా చేసినట్లు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి రాం చంద్ర ప్రసాద్ సింగ్ స్పష్టం చేశారు. గత మూడేళ్లలో ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్ స్టీల్ కంపెనీల్లో రోజువారి తయారయ్యే ఎల్ఎంఓ సామర్థ్యం దాదాపు 70 శాతం పెరిగినట్లు వెల్లడించారు. 2018-19 నుంచి 2020-21 వరకు రోజుకు దాదాపు 2700 టన్నుల సామర్థ్యంతో ఎల్ఎంఓ తయారు కాగా, 2021-22(ఇప్పటి వరకు) రోజుకు 4,102 టన్నుల ఎల్ఎంఓ తయారవుతున్నట్లు పలువురు తెలంగాణకు చెందిన ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వక సమాధానం ఇచ్చారు.