నాగర్ కర్నూల్, మే 19.ప్రజాతంత్రవిలేకరి: ఆర్టీసీ బస్సులు నడపడానికి తెలంగాణ ప్రభుత్వం జీవో చేసింది ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు భారతీయ జనతా పార్టీ తరఫునుండి మాస్కులు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి, అసెంబ్లీ కన్వినర్ పోల్ దాసు రాము మాట్లాడుతూ మీరు జాగ్రత్తగా ఉండండి ప్రజలు జాగ్రత్తగా ప్రయాణించేలా చూడండి అని వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకు లు రాజ వర్ధన్ రెడ్డి, నాగర్ కర్నూల్ టౌన్ ప్రెసిడెంట్ యాదవరెడ్డి, నాగర్ కర్నూల్ టౌన్ అధికార ప్రతినిధి ఎలిమె రాము తదితరులు పాల్గొనడం జరిగింది.