Take a fresh look at your lifestyle.

విలేకరుల కుటుంబాలకు పండ్లు, గుడ్లు పంపిణీ

కరోనా వైరస్‌ ‌సోకి హోం క్వారంటైన్‌లో ఉంటున్న విలేకరుల కుటుంబాలను గురువారం టిఆర్‌ఎస్‌ ‌నాయకులు పరామర్శించారు. దుమ్ముగూడెం గ్రామంలో ఉంటున్న నమస్తే తెలంగాణ( పర్ణశాల) విలేకరి కెల్లా అశోక్‌తో పాటు లక్ష్మీనగరం గ్రామంలో ఉంటున్న వార్త విలేకరి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్బంగా వారు ఆ కుటుంబాలకు మనోధైర్యం కల్పించి పండ్లు, గ్రుడ్లు అందజేశారు.

పరామర్శించిన వారిలో టిఆర్‌ఎస్‌ ‌మండల అద్యక్షుడు అన్నె సత్యనారాయణమూర్తి, అధికార ప్రతినిది యండి జానీ పాషా, దుమ్ముగూడెం పిఏసిఎస్‌ అద్యక్షులు డివిఎస్‌ ‌రాజు, మండల కార్యదర్శి తోట రమేష్‌, ‌భద్రాచలం మార్కెట్‌ ‌కమిటి డైరెక్టర్‌ ‌పూజారి సూర్యచందర్‌రావు, ఎస్సీ సెల్‌ ‌మండల అద్యక్షుడు మోత్కూరి శ్రీకాంత్‌, ‌నర్సాపురం సర్పంచ్‌ ‌వర్సా శివరామకృష్ణ, సింగవరం ఉపసర్పంచ్‌ ‌బూరం మునేశ్వరావు, మండల నాయకులు పిలకా నాగేందర్‌రెడ్డి, సీతయ్య, బాలక్రిష్ణ తదితరులు ఉన్నారు.

Leave a Reply