కారేపల్లి, మై 16, (ప్రజాతంత్ర విలేకరి) : వైరా నియోజకవర్గ ఎంఎల్ఏ లావుడ్యా రాములు నాయక్ తనయుడు బొంబాయి ఇన్‌కంటాక్స్ అసిస్టెంట్ కమీషనర్ లావుడ్యా జీవన్‌లాల్ ఆశీస్సులతో సింగరేణి మండల టిఆర్ఎస్ పార్టీ ప్రధానకార్యదర్శి అజ్మీర వీరన్న మమతల పెళ్లిరోజు సందర్బంగా శనివారం కారేపల్లి సొసైటీ కార్యాలయం చుట్టుప్రక్కల ఉన్న నిరుపే దలకు స్తానిక ఎస్ఐ పొదిలి వెంకన్న చేతుల మీదుగా నిత్యావసరాలు పంపిణీ చేసారు. ఈ సందర్బంగా స్తానిక ఎస్ఐ మాట్లాడుతూ పేదలకు సహాయం చేసే గుణం ఉన్నందుకు మండల నాయకులు వీరన్నకు ధన్యవాదాలు, పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు భూక్యా రాంకిషోర్, అజ్మీర నాగేంద్ర, బానోతు మోహన్, సతీష్, నంద్యా, తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మంలో…
ఖమ్మం,మే 16ప్రజాతంత్ర (ప్రతినిధి): ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు అదేశాల మేరకు నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం ఖమ్మం నగరం లోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో 480 లీటర్ల శానిటైజర్లు, మాస్కులు అందజేశారు. ఖమ్మం డిఎంఅండ్హెచ్ఓ కార్యాలయంలోని కోవిడ్ – 19 విభాగంలో డాక్టర్ మాధవరావుకు, ఖమ్మం జిల్లా ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లుకు, జిల్లా సమాచార శాఖ కార్యాలయంలో డీపీఆర్ఓ యాకూబ్ పాషాకు శానిటైజర్, మాస్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు చిత్తారు సింహాద్రి యాదవ్, నామ సేవా సమితి అధ్యక్ష, కార్యదర్శులు పాల్వంచ రాజేశ్, చీకటి రాంబా బు, ఉపాధ్యక్షులు గోపీ సందేశ్, కృష్ణ ప్రసాద్, ఎంపీ నామ వ్యక్తిగత కార్యదర్శి జి.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
చిరువ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో…
ఖమ్మం నగరంలోని శ్రీవాసవీ చిరువ్యాపారుల సంఘం తెలంగాణ రాష్ట్ర భవానీదీక్షా పీఠం సందర్బంగా లాక్డౌన్ నేపధ్యంలో నిరంతరంగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా శనివారం 53వ రోజు కూరగాయలను పంపిణీ చేసారు. దాతలు ప్రముఖ కూరగాయల వ్యాపా రులు సామినేని జగన్, ములకలపల్లి మహేష్ ఆర్దికసహాయంతో 400 మంది నిరుపేద ఆర్యవైశ్య కుటుంబాలకు ఒక్కోక్కరికి 5 కెజిల చోప్పున 8 రకాల కూరగాయలను పంపిణీ చేసారు. ఈ సందర్బంగా నిర్వాహకలు మాట్లాడుతూ 53రోజులుగా తమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి చేయూతనందిస్తున్న దాతలకు ఎంతో బుణపడి ఉంటామన్నారు. ఆపత్కాలంలో చాలా మంది దాతలు సహృదయంతో ముందుకు వచ్చి తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారని చెప్పారు. 53 రోజులుగా సేవ చేస్తున్న తమ సంఘం సభ్యులకు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు ఇక ముందు కూడా ఇదే స్పూర్తిని కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ శ్రీవాసవీ ట్రస్ట్ బాద్యులు రాయపూడి రమేష్, సంఘ అద్యక్షులు మిట్టపల్లి రవి, ప్రధాన కార్యదర్శి నోముల లక్ష్మీనారాయణ, కోశాధికారి కనికచర్ల లక్ష్మణ్ , మామిడి నారాయణభవాని, మహిళా కమిటి కార్యవర్గ సబ్యులు తదితరులు పాల్గొన్నారు.
గరిడేపల్లిలో…
గరిడేపల్లి, మే 16(ప్రజాతంత్ర విలేకరి) : మండల పరిధిలోని కీతవారిగూడెం గ్రామంలో హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే అరిబండి లక్ష్మినా రాయణ జ్ఞాపకార్థంగా అరిబండి ఫౌండేషన్ పేరుతో వారి మనుమడు, పెంచికల్‌దిన్నె మాజీ సర్పంచ్ సుంకరి క్రాంతికుమార్ పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. గ్రామంలోని 30 పేద కుటుంబాలకు ఆయన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కోఆప్షన్ సభ్యులు ఎస్. వీరరాఘవయ్య, రమాదేవి, సత్యనారాయణ, సుంకరి శ్రీనివాస్, పి.రాఘవులు పాల్గొన్నారు.
మినిస్ట్రీస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో
మండలంలోని సర్వారం గ్రామంల్నోఇ బేతెల్ గాస్పెల్ చర్చి గ్రౌండ్లో హెల్పింగ్ హ్యాండ్ మినిస్ట్రీస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 200 కుటుంబాలకు కూరగాయలను ఎస్సై వెంకన్నగౌడ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అదే విధంగా పారిశుధ్య కార్మికులు, ఆశా కార్యకర్తలకు మాస్క్‌లు, శానిటైజర్లను అందించారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ శామ్యూల్, గుండు, రిబ్కా, ఎంపిటిసి శ్రీనివా సరెడ్డి, సంఘ సభ్యులు పాల్గొన్నారు.
సూర్యాపేటలో…
సూర్యాపేట, మే 16, ప్రజాతంత్ర ప్రతినిధి) : మానవ సేవే మాధవ సేవ అని లయన్స్ క్లబ్ అధ్యక్షులు, జూనియర్ ఛాంబర్ మాజీ అధ్యక్షులు గండూరి కృపాకర్ అన్నారు. శనివారం జనగామ ఎక్స్ రోడ్డులో జూనియర్ ఛాంబర్ ఆధ్వర్యంలో వలస కూలీలకు భోజన ప్యాకెట్లను అందజేసి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ సోకకుండా విధించిన లాక్డౌన్లో భాగంగా తమ ఉపాధి కోల్పోయి, సొంత గ్రామాలకు వెళ్లడానికి వాహనాలు లేకపోవడం వల్ల మండు టెండలో వారు కాలినడకన సొంత గ్రామాలకు వెళ్తున్నారని, వారికి తమకు తోచిన విధంగా సహాయం అందించడం కోసం అన్నదానం కార్యక్రమం చేయడం జరుగుతుందని అన్నారు. దాత గజ్జి రమేష్, చరణ్, మహేష్‌లను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ అధ్యక్షులు యాదా కిరణ్, జూన్ మినిస్టర్, మోర మానస, మహేష్, నవీన్, శ్రవణ్, రవి, సాలయ్య, వెంకటేష్, భిక్షం తదితరులు పాల్గొన్నారు.