Take a fresh look at your lifestyle.

సూపర్‌ ‌స్పెడ్రర్లకు కొరోనా వ్యాక్సిన్‌ ‌పంపిణీ

  • పలుచోట్ల ప్రారంభించిన మంత్రులు, అధికారులు
  • నగరంలో పర్యవేక్షించిన సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌

రాష్ట్రంలోని సూపర్‌ ‌స్పెడ్రర్లకు కొరోనా వ్యాక్సిన్‌ ‌పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. హైదరాబాద్‌లో పలుచోట్ల మంత్రులు, ప్రజాప్రతనిధులు, అధికారులు ప్రారంభించారు. ప్రెస్‌క్లబ్లో ఈ కార్యక్రమాన్ని సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ ‌పర్యవేక్షించారు. జర్నలిస్టులకు రెండ్రోజుల పాటు వ్యాక్సిన్‌ ‌వేయనున్నారు.  వనపర్తిలో మంత్రి నిరంజన్‌ ‌కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మూడు రోజులపాటు కొనసాగనున్న ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా వ్యాక్సిన్‌ ‌పంపిణీని ప్రారంభించారు. స్పైడర్‌ల వ్యాక్సినేషన్‌ ‌మూడురోజుల్లో పూర్తి చేస్తామని సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ ‌తెలిపారు. .రెండ్రోజుల పాటు జర్నలిస్టులకు వ్యాక్సినేషన్‌ ఉం‌టుంది.

హైదరాబాద్‌ ‌లో ఐదుచోట్ల ఐదుచోట్ల జర్నలిస్టులకు వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీకాలు పంపిణీ చేస్తారు. నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి, వారి అవసరాల తీర్చే దుకాణదారులు, తోపుడు బండ్ల వ్యాపారులు, ఆటో, క్యాబ్‌ ‌డ్రైవర్లు, డెలివరీ బాయ్స్, ‌జర్నలిస్టులు తదితరులకు వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. వీరికి వ్యాక్సిన్‌ ‌వేయడం ద్వారా కొరోనా వైరస్‌ ‌చైన్‌ను తెంచడానికి ఆస్కారం ఉంటుందని అధికారులు గుర్తించారు. ప్రత్యేక డ్రైవ్‌ ‌ద్వారా మొదటి దశలో 7.75 లక్షల మంది సూపర్‌ ‌స్పైడ్రర్లకు వ్యాక్సిన్‌ అం‌దించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

శుక్రవారం నుంచి మూడురోజుల పాటు టీకాలు వేయడానికి ఏర్పాట్లు చేసింది. 33,980 మంది రేషన్‌ ‌డీలర్లు, 49,611 మంది గ్యాస్‌ ‌డీలర్లు, సిబ్బంది, 1,435 మంది ఫుడ్‌ ‌కార్పొరేషన్‌ ఉద్యోగులు, 30 వేల మంది ఎరువులు, విత్తనాల దుకాణదారులు, సిబ్బంది, 20 వేల మంది జర్నలిస్ట్‌లు, జీహెచ్‌ఎం‌సీ పరిధిలో 3 లక్షల మంది అటోడ్రైవర్లు, క్యాబ్‌ ‌డ్రైవర్లు, రైతుబజార్లలో వర్తకులు, మార్కెట్‌ ‌యార్డు సిబ్బంది, హమాలీలు, వీధి వ్యాపారులు, 3 లక్షల మంది సెలూన్ల నిర్వాహకులు, 91 వేల మంది కిరాణదుకాణాల సిబ్బంది ఉన్నారు.

Leave a Reply