ఖమ్మం సిటి, జూలై 7 (ప్రజాతంత్ర విలేకరి): తెలంగాణ రాష్ట్ర రవా ణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మంగళవారం ఖమ్మం నగరం లోని వీడివోస్ కాలనీలోగల క్యాంపు కార్యాలయంలో లబ్దిదారులకు సిఎంఆర్‌ఎప్ చెక్కులను పంపిణీ చేసారు. వివిధ రకాల చికిత్సల అనంతం వారికి ప్రభుత్వం నుండి మంజూరైన చెక్కులను ఈ సందర్బంగా అందజేసారు. మొత్తం 63 మంది లబ్దిదారులకు గాను రూ. 25.90లక్షల విలువల గల చెక్కులను పంపిణీ చేసారు. ఈ సందర్బంగా ఆయన మా ట్లాడుతూ ఇప్పటివరకు రూ. 2.50కోట్ల రూపాయలు సిఎంఆర్ఎఫ్ కింద పంపిణీ చేసినట్లు చెప్పారు. అనారోగ్య కారణాలతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం నుండి ఈ సహాయం అందుతుందన్నారు. ప్రభుత్వం అన్నివర్గాల వారికి అండగా ఉండి వారి సంక్షేమం కోసం పాటుపడుతుందన్నారు. ప్రతి ఒక్కరు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండి ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా పరిసరా లను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పరిశుభ్రతతో ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర మేయర్ డాక్టర్ గుగులోతు పాపాలాల్, ఎంఎల్‌సి బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, తెరాస పార్టీ కార్యాలయం ఇంచార్జి ఆర్జెసి కృష్ణ, కార్పోరేటర్లు కమర్తపు మురళి, తదితరులు పాల్గొన్నారు.
మంత్రి పువ్వాడ సమక్షంలో టిఆర్ఎస్లోకి చేరికలు:
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుండి తెరాసలోకి భారీ చేరికలు జరిగాయి. మధిర మండలం ఆత్కూరు గ్రామం నుండి పలువురు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజ్ ఆధ్వర్యంలో రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సమక్షంలో మంగళవారం చేరారు. గ్రామసర్పంచ్ అబ్బూరి సంద్యారాణి, ఎంపిటిసి మినుగు పాండురంగారావు, వైస్‌చైర్మన్ ఖమ్మంపాటి చిట్టిబాబు, వార్డు సభ్యులు మినుగు రమాదేవి, లక్ష్మీ, అంకె శీరిష, ఎస్కె లాల్‌సాహెబ్, బి కృష్ణ, కె సాల్మన్, దివ్య, ఎ వెంకటేశ్వర్లుతో పాటు పార్టీ నాయకులతో పాటు పలు కుటుంబాలు పెద్ద ఎత్తున పార్టీలో చేరారు. వీరిని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మంగళవారం వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర మేయర్ డాక్టర్ గుగులోతు పాపాలాల్, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, ఎంఎల్‌సి బాలసాని లక్ష్మీనారాయణ, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, జిల్లా పార్టీ కార్యాలయ ఇంచార్జి ఆర్జెసి కృష్ణ, నల్లమల వెంకటేశ్వరరావు, బొమ్మెర రామ్మూర్తి, మండల అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, కార్యదర్శి చిత్తారు నాగేశ్వరరావు, ఆత్మ కమిటి చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, మార్కెట్ కమిటి చైర్మన్ వెంకటరెడ్డి పాల్గొన్నారు.