ఖమ్మం సిటి, మే 30, (ప్రజాతంత్ర విలేకరి) : ఖమ్మం నగర పరిధిలోని 37వ డివి•న్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటి డైరక్టర్ పసుమర్తి రామ్మోహనరావు రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆదేశాల మేరకు శనివారం 37,45వ డివిజన్ భక్తపోతనవీధి, హనుమాన్టెంపుల్రోడ్, పిఎస్ఆర్ రోడ్ పరిధిలోని లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన 200 నిరుపేద కుటుంబాలకు ఖమ్మం త్రీటౌన్ సిఐ శ్రీధర్ చేతుల మీదుగా నిత్యావసరాలు పంపిణీ చేసారు.లాక్డౌన్ సందర్బంగా ఉపాధి కోల్పోయిన డివిజన్ ప్రజలకు గత 15 రోజులుగా సుమారు వెయ్యి కుటుంబాలకు,మాస్క్‌లు ధరించి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఈ సందర్బంగా సిఐ మాట్లాడుతూ మున్ముందు ఇలాంటి కార్యక్రమాలెన్నో చేయాలని, మానవతాదృక్పథంతో ఇలాంటి కార్యక్రమం చేసినందుకు డివిజన్ నాయకులను అభినందిస్తున్నానన్నారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా వచ్చిన సిఐ శ్రీధర్‌ను నిర్వాహకులు శాలువా కప్పి సన్మానించారు ఈ కార్యక్రమంలో 45వ డివిజన్ ఇంచార్జి బోజెండ్ల రామ్మోహనరావు, 37వ డివిజన్ సెక్రటరీ పిల్లుట్ల కృష్ణ, నాయకులు కె శ్రీనివాస్, కె ఆంజనేయులు,కె వెంకటేశ్వరరావు, ఎ సతీష్, బి శ్రీను, జి రాజేష్,కె శ్రీను, వి శివ, ఎం శ్రీనివాస్, ఎం కోటి,రావూరి అరుణ, దరపల్లి కళావతి పాల్గొన్నారు.