Take a fresh look at your lifestyle.

పేదలకు డబ్బు పంచండి

ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి అదే మందు : రాహుల్‌

పేదలకు నగదు ఇవ్వాలని, పారిశ్రామికవేత్తలకు పన్ను రాయితీలు కల్పించకూడదని రాహుల్‌ అభిప్రాయపడ్డారు. ఖర్చు పెరిగితేనే .. ఆర్థిక వ్యవస్థ మళ్లీ పునరుత్తేజం అవుతుందన్నారు. ఆర్బీఐ ఇచ్చిన వార్నింగ్‌ ‌గురించి రాహుల్‌ ‌గాంధీ ట్వీట్‌ ‌చేశారు. కొన్ని నెలల నుంచి తాను ఇస్తున్న వార్నింగ్‌నే.. ఇప్పుడు ఆర్బీఐ ద్రువీకరించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం డబ్బును ఖర్చు చేయాలని, రుణాలు ఇవ్వడం సరికాదు అని ఆర్బీఐ చెప్పినట్లు రాహుల్‌ ‌తన ట్వీట్‌లో గుర్తు చేశారు. డియా ద్వారా అసలు విషయాలను పక్కదోవ పట్టిస్తే.. దాని వల్ల పేదలకు న్యాయం జరగదన్నారు.

ఆర్బీఐ మంగళశారం తన వార్షిక నివేదికను రిలీజ్‌ ‌చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థపై కొరోనా తీవ్ర ప్రభావం చూపినట్లు ఆ  నివేదికలో చెప్పింది. నిలకడైన వృద్ధి కోసం మరిన్ని సంస్కరణలు అవసరం అన్నది. భూ, కార్మిక, విద్యుత్‌ ‌రంగాల్లో జీఎస్టీ తరహా కౌన్సిల్‌ ఏర్పాటు కావాలన్నది. కొవిడ్‌-19‌తో ఆర్థిక లక్ష్యాల సాధన కష్టతరంగా మారినట్లు తెలిపింది. రాబోయే నెలల్లో ద్రవ్యోల్బణం మరింత పైకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలియజేసింది. 2019-20లో బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్లను గతంతో పోల్చితే ఎక్కువగానే తగ్గించారన్నది.  దేశ ఆర్థిక వ్యవస్థను గ్టటెక్కించడంలోప్రభుత్వానిదే కీలకపాత్ర అని చెప్పింది.  మార్కెట్‌లో డిమాండ్‌ ‌పుంజుకోవడానికి ఇంకా సమయం ఉందన్నది. వాతావరణ మార్పులు దేశ వ్యవసాయ రంగానికి దెబ్బే అని,  సెప్టెంబర్‌దాకా మందగమన పరిస్థితులే ఉంటాయని ఆర్బీఐ అంచనా వేసింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply