Take a fresh look at your lifestyle.

మమతలో అసంతృప్తి పెరుగుతోంది

బెంగాల్‌ ‌ప్రజలు బీజేపీకి విజయాన్ని ఖాయం చేశారన్న ప్రధాని మోడీ
‌ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమబెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మరోసారి విమర్శలు గురిపించారు. రాష్ట్రంలోని షెడ్యూల్డ్ ‌కులాలు, షెడ్యూల్డ్ ‌తెగలు, ఇతర వెనుకబడిన తరగతులపై దీదీ బహిరంగ యుద్ధం ప్రకటించారని ఆక్షేపించారు. తనపైనే కాకుండా, బెంగాల్‌లోని ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ వర్గాలకు చెందిన తన సోదర సోదరీమణులపై దీదీ యుద్ధం ప్రకటించారని నార్త్ 24 ‌పరగణాల జిల్లాల్లో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ మోదీ అన్నారు. మొదటి నాలుగు విడతల పోలింగ్‌లో బెంగాల్‌ ‌ప్రజలు బీజేపీకి విజయాన్ని ఖాయం చేశారని ప్రధాని పేర్కొన్నారు. మమత ఆగ్రహానికి ఇదొక కారణమని అన్నారు. ఎన్నికల్లో హింస గురించి మోదీ ప్రస్తావిస్తూ, ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని కనీసం ఒక్క ఎన్నికల ర్యాలీలోనైనా మమత పిలుపునిచ్చారా అని ప్రశ్నించారు. హింసకు పాల్పడే వారు, ఓటింగ్‌ను అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మాటమాత్రంగానైనా మమత చెప్పారా అని ఆయన నిలదీశారు.  పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు దశల పోలింగ్‌ ‌ముగిసిన తర్వాత సీఎం, తృణమూల్‌కాంగ్రస్‌ అధినేత్రి మమతా బెనర్జీలో అలజడి నెలకొందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దీదీలో ఓటమి భయం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. బెంగాల్‌లోని బరాసత్‌లో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మోదీ మాట్లాడుతూ మే 2న ఎన్నికల ఫలితాల రోజు ఆమెకు ఇప్పుడే వచ్చినట్టు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.

దీదీ ఆమె పార్టీ పరిస్ధితి వినాశకాలే విపరీతబుద్ధి అన్న చందంగా ఉందని వ్యాఖ్యానించారు. బీజేపీకి భారీగా ఓట్లు పడుతున్నాయని గ్రహించిన మమతా బెనర్జీ బెంగాల్‌లో భారీ పోలింగ్‌ ‌జరగకుండా అడ్డకుంటు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. విధ్వంసం సృష్టిస్తున్న తృణమూల్‌ ‌గూండాలపై చర్యలు చేపట్టడం లేదని అన్నారు. అంతకుముందు ప్రధాని పుర్బ వర్ధమాన్‌ ‌జిల్లాలోని తలిత్‌ ‌సాయి సెంటర్‌లో, నదియా జిల్లాలోని కళ్యాణి యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించారు. కాగా, బెంగాల్‌లో 8వ విడతల పోలింగ్‌లో భాగంగా ఇంతవరకూ నాలుగు విడతలు పూర్తయ్యాయి. ఐదో విడత పోలింగ్‌ ఈనెల 17న జరుగనుంది.

Leave a Reply