Take a fresh look at your lifestyle.

జాతీయ స్థాయి కబడ్డీ పోటీల లో అపశృతి

  • కుప్పకూలిన గ్యాలరీ
  • పదుల సంఖ్యలో ప్రేక్షకులకు గాయాలు
  • వెంటనే స్పందించిన అధికారులు
  • పరిమితికి మించిన ప్రేక్షకులకు అనుమతి

సూర్యాపేట,ప్రజాతంత్ర విలేఖరి, మార్చి 22: 47 వ జాతీయ స్థాయి జూనియర్ బాలబాలికల ఛాంపియన్షిప్ 2021 కబడ్డీ పోటీలకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఈ కబడ్డీ పోటీలకు ఇతర రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున ఆటగాళ్లు రావడం జరిగింది.

సోమవారం అర్ధగంటలో కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యే సమయంలో ఒక వైపు ఉన్న గ్యాలరీలో సుమారు 1500 మంది వరకు ప్రేక్షకులు కూర్చొని ఉండడంతో ప్రేక్షకులకు అనుమతి ఇవ్వడంతో ఒక్కసారిగా కుప్పకూలడంతో పదుల సంఖ్యలో ప్రేక్షకులకి తీవ్రగాయాలు కావడంతో అధికారులు వెంటనే స్పందించి క్షతగాత్రులను స్థానిక ఏరియా ఆసుపత్రికి ప్రైవేట్ హాస్పిటల్స్ కు తరలించారు.

ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు అయినా కూడా పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నది. నిర్వాహకులు అనుభవం లేని వారు కాబట్టే ఈ సంఘటన జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు. ఏ హాస్పిటల్ చూసినా శోక సముద్రంగా మారింది వారి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.

Leave a Reply