సిఎం కెసిఆర్ సూచనల మేరకు నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా 47 వ డివిజన్ లోని గోకుల్ నగర్లో సోమవారం చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ముఖ్యఅతిథిగా పాల్గొని పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొని కాలనీలో చెత్త చెదారాని తొలగించి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు కాలనీలో శుభ్రత పాటించాలన్నారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు.
తమ పరిసరాలను కూడా విధిగా శుభ్రంగా ఉంచుకోవాలని ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, అడిషనల్ కలెక్టర్ దయానంద్, కార్పొరేటర్ నల్లా స్వరూపరాణి సుధాకర్ రెడ్డి, ఎమ్హెచ్ఓ రాజిరెడ్డి పాల్గొన్నారు.