Take a fresh look at your lifestyle.

కరోనాపై అఖిలపక్షంలో చర్చించాలి: రామకృష్ణ

కరోనా వైరస్‌ ‌వ్యాప్తి నివారణ చర్యలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ కోరారు. రైతులు, వలస కార్మికులను ఆదుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ లాక్‌ ‌డౌన్‌ ‌పొడిగించిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకున్నందున.. అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి సహకరించాలని కోరుతున్నామన్నారు. అట్టడుగు వర్గాల ప్రజలు, వ్యవసాయ కూలీలు, వలస కార్మికులు, రైతులపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని రామకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు.

వెల్ఫేర్‌ ‌సెస్‌ ‌నిధులు వారి కోసం ప్రభుత్వం ఖర్చు చేయాలని కోరారు. దీనికి సంబంధించి మార్చి 24న కేంద్ర ప్రభుత్వం జీవో కూడా జారీ చేసిందన్నారు. దీనిపై జగన్‌ ‌ప్రభుత్వం ఏమాత్రం స్పందించడంలేదని ఆయన విమర్శించారు. వాళ్ల డబ్బులు వారికివ్వడానికి జగన్‌కు వచ్చిన ఇబ్బంది ఏంటని ఆయన ప్రశ్నించారు. అందుచేత ప్రతి పేద కుటుంబానికి రూ. 5వేలు ఇవ్వాలని రామకృష్ణ డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply