“తెలంగాణ సాధన ఉద్యమంలో ఉపాధ్యాయులు చాలా క్రియాశీలకంగా పాల్గొని అనేక పోరాటాలు చేసి తెలంగాణ ఏర్పాటుకు కృషి చేశారు. వివిధ రకాల పోరాటాల ద్వారా, 1200 మంది త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణలో ఉద్యమ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక ఉపాధ్యాయుల విద్యారంగ సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తే, ఏడు సంవత్సరాలు దాటినా ఏ ఒక్క సమస్య పరిష్కరించ బడలేదు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నాలుగు దశాబ్దాలుగా పరిష్కరించబడని ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ ను రెండు పేజీల లో రూపొందిస్తానని చెప్పి ఏడు సంవత్సరాలు దాటినా పరిష్కరించక విఫలం అయ్యారు.”
తెలంగాణ సాధన ఉద్యమంలో ఉపాధ్యాయులు చాలా క్రియాశీలకంగా పాల్గొని అనేక పోరాటాలు చేసి తెలంగాణ ఏర్పాటుకు కృషి చేశారు. వివిధ రకాల పోరాటాల ద్వారా, 1200 మంది త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణలో ఉద్యమ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక ఉపాధ్యాయుల విద్యారంగ సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తే, ఏడు సంవత్సరాలు దాటినా ఏ ఒక్క సమస్య పరిష్కరించ బడలేదు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నాలుగు దశాబ్దాలుగా పరిష్కరించబడని ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ ను రెండు పేజీల లో రూపొందిస్తానని చెప్పి ఏడు సంవత్సరాలు దాటినా పరిష్కరించక విఫలం అయ్యారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలందరూ పేద ,ధనిక వ్యత్యాసాలు లేకుండా అందరూ ఒకే చోట చదువుకునేందుకు కామన్ స్కూల్ విద్యా విధానం ప్రవేశ పెడతానని హామీ ఇచ్చారు. కామన్ స్కూల్ విద్యావిధానం ద్వారా అందరికీ అంతరాలు లేని విద్య అందుతుంది. సమాన విద్యావకాశాలు అందుతాయి.అందుకే కామన్ స్కూల్ ప్రవేశ పెట్టుతానన్నారు.కానీ ఆ దిశగా ఏ మాత్రం ఆలోచన చేయడం లేదు. డాక్టర్ డి.ఎస్.కొఠారి చెప్పిన విధంగా ‘‘దేశ భవిష్యత్ తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది.’’ అన్నారు. తరగతి గదిలో రూపుదిద్దుకోవాలంటే దేశ భవిష్యత్తును మార్చే ఉపాధ్యాయులను, ప్రభుత్వ పాఠశాలలను కామన్ స్కూల్ గా మార్చే దిశగా ముఖ్యమంత్రి గారు ఆలోచించకుండా ప్రభుత్వం పాఠశాలను పట్టించుకోకుండా నిర్వీర్యం చేస్తున్నారు.
ఆరు సంవత్సరాల నుండి ఉపాధ్యాయులకు ఏ ఒక్క ప్రమోషన్ ఇవ్వకుండ మనోవేదనకు గురి చేస్తున్నారు, మనోవేదనతో ప్రమోషన్ పొందకుండానే వందల మంది ఉపాధ్యాయులు రిటైర్ అయినారు. ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఆరు సంవత్సరాలుగా ఇవ్వక పోవడం వలన ఎస్ జి టి గా నియామకం అయిన ఉపాధ్యాయుడు 30 సంవత్సరాల పైన సర్వీసు పూర్తి చేసి ఎస్ జి టి లేదా స్కూల్ అసిస్టెంట్ గా , స్కూల్ అసిస్టెంట్ గా నియామకం అయిన ఉపాధ్యాయుడు స్కూల్ అసిస్టెంట్ లేదా హెడ్మాస్టర్ గా రిటైర్డ్ అవుతున్నారు. కానీ వేరే డిపార్ట్మెంట్ లలో జూనియర్ అసిస్టెంట్ గా నియామకమైన వారు తహసీల్దారుగా,ఆర్డీవో గా మరియు జిల్లా స్థాయి గెజిటెడ్ ఆఫీసర్, డీఈవో స్థాయి వరకు కూడా ప్రమోషన్ పొందుతున్నారు. అందువల్ల ఉపాధ్యాయ వృత్తి లో చేరడం ఉపాధ్యాయులు శాపంగా పరిగణిస్తున్నారు. మిగతా డిపార్ట్మెంట్ల వారికి ప్రతి సంవత్సరం డి. పి .సి .రూపొందించి ప్రమోషన్లు ఇస్తున్నారు.ఉపాధ్యాయులు అనేక ఐక్య ఉద్యమాలు చేసిన ఫలితంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 2021 జనవరిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వుల మేరకు అన్ని డిపార్ట్మెంట్ లలో ప్రమోషన్లు కల్పించినారు.కానీ కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే ప్రమోషన్లు ఇవ్వకుండా వివక్షత చూపిస్తూ, తాత్సారం చేస్తున్నారు .ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అనేక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులలో ఖాళీలు ఉన్నాయి. మండల విద్యాశాఖ అధికారి, ప్రధానోపాధ్యాయుల పోస్ట్ లు ఖాళీలుగా ఉండడంవల్ల పాఠశాలలో పర్యవేక్షణ లోపించడం వల్ల విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. ఉన్నత పాఠశాలలలో సబ్జెక్ట్ టీచర్ల కొరత వల్ల విద్యార్థుల నాణ్యత ప్రమాణాలు దెబ్బతింటున్నాయి.
నాలుగు దశాబ్దాలుగా ఉన్న ఉపాధ్యాయుల ప్రధాన సమస్యను లి1998 లో జీవో నం. 505 తేదీ 16-11-1998, జీవో నం.538 తేదీ 20-11-1998 జీవోల ద్వారా ఏకీకృతం చేసి కామన్ గా ప్రభుత్వ, పంచాయతీరాజ్ యాజమాన్యాల ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు చేశారు. ఈ కామన్ సర్వీసు రూల్స్ ఉత్తర్వుల ద్వారా వందల మంది జూనియర్ లెక్చరర్, యం.ఈ.వో,డిప్యూటీ ఈ వో,డైట్ లెక్చరర్, బి ఈ డి కాలేజ్ లెక్చరర్ మొదలగు పోస్టులకు పదోన్నతులు పొందారు. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 302 జీవో తేదీ 30 డిసెంబర్ 1993 ద్వారా 2008 సంవత్సరం వరకు ప్రభుత్వ మరియు పంచాయత్ రాజ్ ఉపాధ్యాయులకు 40 శాతం చొప్పున అర్హత గల స్కూల్ అసిస్టెంట్లకు జూనియర్ లెక్చరర్ పోస్ట్ లకు పదోన్నతులు కల్పించారు. కానీ 18 సెప్టెంబర్ 2008 లో 223 జీవో తెచ్చి జూనియర్ లెక్చరర్ పోస్టులు ఉపాధ్యాయులకు ఇవ్వకుండా చేసింది. కాబట్టి ప్రభుత్వం 223 జీవో ను రద్దు చేసి 302 జీవోను పునరుద్ధరించి ఉపాధ్యాయులకు మళ్ళీ జూనియర్ లెక్చరర్ పదోన్నతులు కల్పించాలని వేలాది మంది ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారు.
505 ,538 జీవోలపై ప్రభుత్వ ఉపాధ్యాయులు కోర్టుకు వెళ్ళితే దానిని హైకోర్టు కొట్టివేస్తే ,కేసు సుప్రీంకోర్టు కు వెళ్ళితే, సుప్రీం కోర్టు 30-9-2015 న తీర్పు వెలువరించింది లిఇట్టి తీర్పు ప్రకారం కొన్ని సాంకేతిక సమస్యలు పరిష్కరించుకొని ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసు రూల్స్ అమలు చేయవచ్చని తీర్పు వెలువరించిందిలి.2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ కొరకు ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఉపాధ్యాయుల సర్వీసులు ఇంటిగ్రేటెడ్ క్యాడర్ గా ప్రకటిస్తూ లిరాష్ట్రపతి ఉత్తర్వులు జి.ఎస్.ఆర్.నం.637 (ఇ), 639(ఇ) లను తేదీ 23-6-2017 న జారీ చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే సర్వీసు రూల్స్ రూపొందించి ప్రమోషన్లు, బదిలీలు చేస్తే బాగుండు. కానీ రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం వల్ల ప్రభుత్వ ఉపాధ్యాయులు మళ్ళీ హైకోర్టు లో కేసు వేశారు. పి.పి.నం.23267/2017, 23274/2017, 27404/2017 తో హైకోర్టు లో పిటీషన్ వేశారు. లిహైకోర్టు కొన్ని సాంకేతిక సమస్యల ప్రాతిపదికతో హైకోర్టు రాష్ట్రపతి ఉత్తర్వులను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చిందిలి. అట్టి తీర్పుపై సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ అప్పీల్ నెం.1819-1821/2019 ద్వారా తెలంగాణ ప్రభుత్వం అప్పీల్ చేసింది. అప్పీల్ ఆధారంగా తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చారు. ఇక ఫైనల్ తీర్పు దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేయక పోవడం వల్ల ఏకీకృత సర్వీసు రూల్స్ సమస్య పరిష్కరించబడలేదు.
కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం యాజమాన్యాల వారిగా సర్వీసు రూల్స్ రూపొందించి పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని వేలాది మంది ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారు. ఉపాధ్యాయుల ఐక్య ఉద్యమాల పోరాట తీవ్రతను గ్రహించి గత 22 మార్చి 2021 న స్వయంగా గౌరవ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో వాగ్దానం చేసి, హామీ ఇచ్చి 3 నెలలు దాటినా మరియు 16 మే 2018 న ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో ఐదున్నర గంటలు చర్చలు జరిపి ఉపాధ్యాయుల సంఘాల నాయకులకు ఇచ్చిన హామీలను ముఖ్యంగా ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ సమస్యను 3 సంవత్సరాలు దాటినా దాని గురించి పట్టించుకోకపోవడం ,శ్రద్ద పెట్టకపోవడం చాలా బాదాకరం. ఇప్పటి కైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించాలి అంటే తక్షణమే ఉపాధ్యాయులకు సర్వీసు రూల్స్ రూపొందించి ఉపాధ్యాయుల పట్ల వివక్షత చూపించకుండా యాజమాన్యాల వారీగా ప్రమోషన్లు ఇవ్వాలని మరియు 10 సంవత్సరాలకు పైగా ఉపాధ్యాయులు ఒకే చోట దూరప్రాంతాలలో పని చేస్తున్న వారు ఉన్నారు. బార్య భర్తలు మరియు అనారోగ్యంతో బాధపడుతున్న ఉపాధ్యాయులు ,ఇంటర్ డిస్ట్రిక్టు ఉపాధ్యాయులు బదిలీల కొరకు ఎదురు చూస్తున్నారు.
కాబట్టి ముఖ్యమంత్రి , విద్యాశాఖ మంత్రి మరియు విద్యాశాఖాధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీల షెడ్యూల్ రూపొందించి వెబ్ కౌన్సెలింగ్ ద్వారా వారం ,పదిరోజులలో ప్రక్రియను పూర్తి చేయాలి. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అన్ని హామీలుగానే మిగిలి పోకూడదు. ప్రస్తుతం కరోనా మహమ్మారి ఉదృతి పూర్తిగా తగ్గక పోయినా,తల్లి దండ్రులు వారి పిల్లలను పాఠశాలలకు పంపించడానికి అయిష్టంగా ఉన్నా పాఠశాలలు 1 జూలై నుండి ప్రత్యక్ష బోధనకు పాఠశాలలు ప్రారంభిస్తున్నందున , పాఠశాలల నిర్వహణకు మరియు విద్యార్థుల చదువుకు అంతరాయం కలుగకుండా ఉండేందుకు ముందుగానే పదోన్నతులు బదిలీల ప్రక్రియను చేపట్టాలని వేలాది మంది ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగులకు కొత్త సర్వీసు రూల్స్ విధివిధానాలు ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ప్రభుత్వానికి ఉన్నది. ఆమేరకు ప్రభుత్వం ఉపాధ్యాయుల సర్వీసు రూల్స్ యాజమాన్యాల వారిగా రూపొందించి పదోన్నతులు ,బదిలీల ప్రక్రియ చేపట్టి ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, ప్రజలపై, ఉపాధ్యాయులపై ఉంది. కాబట్టి దళిత ,గిరిజన, బహుజనుల పిల్లలకు విద్య అందాలంటే ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలి. ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న ఇరవై వేల ఉపాధ్యాయ పోస్టులను నిరుద్యోగులతో నింపి ,నిరుద్యోగులను ఆదుకోవాల్సిన బాధ్యత మరియు ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆదిశగా ప్రభుత్వం ఆలోచించాలి.
– కందుకూరి దేవదాసు
జిల్లా అధ్యక్షులు ,డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ వరంగల్ రూరల్ జిల్లా. 9949937745