Take a fresh look at your lifestyle.

తిరుమల దర్శనాలను నిలిపివేయం: ఛైర్మన్‌ ‌వైవీ సుబ్బారెడ్డి

తిరుమల,జూలై 21 :  భక్తుల ద్వారా కరోనా సోకలేనందున తిరుమల, తిరుపతి దేవస్థానంలో దర్శనాలను నిలుపుదల చేయబోమని టీటీడీ బోర్డు ఛైర్మన్‌ ‌వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుపతి పట్టణంలో లాక్‌డౌన్‌ అమలులో ఉన్నందున భక్తులకు సర్వదర్శనం కోసం జారీ చేస్తున్న టోకెన్లను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ’ తిరుపతి పరిసర ప్రాంతాల భక్తులు దర్శనానికి రావొద్దు, ఆన్‌లైన్‌ ‌ద్వారా టిక్కెట్లు పొందిన భక్తులు మాత్రమే దర్శనానికి రావాలి’ అని సూచించారు. ఆన్‌లైన్‌ ‌ద్వారా రోజూ 9వేల మంది భక్తులకు మాత్రమే అవకాశముందని ఆయన వెల్లడించారు. వచ్చే భక్తులను అలిపిరి వద్ద పరీక్షించి కొండపైకి అనుమతి ఇస్తున్నామని, జ్వరం, తదితర అనుమానిత లక్షణాలు ఉంటే వారిని ఆస్పత్రికి తరలిస్తున్నామని సుబ్బారెడ్డి వివరించారు. చిన్నపిల్లలు, వృద్ధులను దర్శనానికి తీసుకురావద్దొని,మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు.

Leave a Reply