Take a fresh look at your lifestyle.

కొరోనా వ్యాక్సిన్‌ ‌పంపిణిపై సీఎం కేసీఆర్‌ ‌దిశా నిర్దేశం

రాష్ట్రంలో కొరోనా వ్యాక్సిన్‌ ‌పంపిణిపై మంత్రులు, అధికారులకు సీఎం కేసీఆర్‌ ‌దిశా నిర్దేశం చేశారు. టీకా పంపిణిపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కొరోనా వ్యాక్సిన్‌తో పాటు పరిపాలనకు సంబంధించిన పలు ఇతర అంశాలపై సీఎం కేసీఆర్‌ ‌మంగళవారం ప్రగతిభవన్‌లో మంత్రులు, కలెక్టర్లతో సుదీర్ఘంగా చర్చించారు.

టీకా పంపిణీలో ఎక్కడ ఏ చిన్న అపశ్రుతి చోటు చేసుకున్నా మొత్తం ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు వస్తాయనీ, హితబోధ చేశారు. టీకా పంపిణీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులంతా భాగస్వాములు కావాలనీ, సర్పంచ్‌ ‌నుంచి మంత్రి స్థాయి వరకూ అంతా ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజాప్రతినిధులు యాక్టివ్‌గా ఉంటే అధికారులు అలసత్వం వహించరనీ, స్పష్టం చేశారు.

Leave a Reply