దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్, ఆంధ్రప్రదేశ్ భవన్లను పూర్తిస్థాయి లాక్డౌన్ చేశారు. మహమ్మారి కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్, ఆంధ్రప్రదేశ్ భవన్ ఆర్సీ భావనా సక్సేనా తెలిపారు. ఈ మేరకు ఇద్దరు కమిషనర్లు సోమవారం వారివురు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు.
రెండు రాష్ట్రాల భవన్లో కూడా 60 ఏళ్ల వయసు దాటిన ఉద్యోగులు విధులకు హాజరు కారదని ప్రకటనలో పేర్కొన్నారు. 20 శాతం సిబ్బంది మాత్రమే రొటేషన్ బేసిస్ లో పని చేయాలని చెప్పారు. అత్యవసర సిబ్బంది కూడా ఫోన్ చేస్తేనే విధులకి రావాలని చెప్పారు. దాంతోపాటు, భవన్‌కి వచ్చే అతిథులు కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భవన్లకి రాకూడదని విజ్ఞప్తి చేశారు.ఈసరికే ఏపీ భవన్ క్యాంటీన్ మూసిన విషయం తెలిసిందే.