Take a fresh look at your lifestyle.

కొరోనా సోకిందంటే కాటికేనా!

వైరస్‌ ‌కట్టడిలో ప్రభుత్వ వైఫల్యం
ఉమ్మడి పాలమూరు జిల్లాలో వైద్యుల కొరత
భయం గుప్పిట్లో ప్రజలు

యావత్‌ ‌ప్రపంచాన్ని వణికిస్తున్న కొరోనా మహమ్మారి సోకిన వారి ప్రాణాలు గాల్లో దీపంలా  వేలాడుతున్నా
యి. వందల సంఖ్యలో ప్రాణాలు కూడా పోయాయి. వైరస్‌ ‌కట్టడిలో ప్రభుత్వం వైఫల్యం చెందిందా లేక ప్రజలు వైరస్‌ ‌బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన సూచనలు, నిబంధనలు పాటించడం లేదా అంటే ప్రభుత్వం కొరోనా కట్టడిలో విఫలయ్యిందని కొందరు వైద్యులే చెబుతున్నారు. జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌లో వైద్య సిబ్బంది కొరత ఉందంటున్నారు. నూతనంగా ఏర్పడిన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటళ్లలో పల్మనాలజిస్ట్‌లు లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగర్‌ ‌కర్నూలు జిల్లా కేంద్రంలోని హాస్పిటల్‌లో పల్మనాలజిస్ట్‌తో పాటు వైద్య అధికారులు, సిబ్బంది కొరత ఉందంటున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మార్చి నెల నుండి• ఇప్పటివరకు 2000 కేసులకు పైగా పాజిటివ్‌ ‌వచ్చాయి. మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలో మంగళవారం రాత్రి సమయానికి 610 పాజిటివ్‌ ‌కేసులు రాగా నాగర్‌ ‌కర్నూలు జిల్లాలో 526, వనపర్తి జిల్లాలో 253, గద్వాల జిల్లాలో 402, నారాయణపేట జిల్లాలో 143 నమోదవగా ఉమ్మడి• జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు వైరస్‌ ‌బారిన పడి మరణించిన వారి సంఖ్య 51 గా నమోదయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు మూడు వందల పైచిలుకు కేసులు రికవరీ అయినట్టుగా సంబంధిత శాఖ అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేటి వరకు వేల సంఖ్యలో కొరోనా పరీక్షలను నిర్వహిస్తే దాదాపు 2000 వరకు పాజిటివ్‌ ‌కేసులు నమోదవడంతో ఇటు ప్రభుత్వ వైద్యులు అటు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం మహబూబ్‌నగర్‌ ‌జిల్లా కేంద్రంలో ఇదివరకు ఐసోలేషన్‌ ‌సెంటర్లను ఏర్పాటు చేసి వ్యాధి తీవ్రంగా ఉన్న సమయంలో వాటిని ఎత్తేసారు. ప్రభుత్వం చేతులెత్తేసి హోమ్‌ ‌క్వారంటైన్‌పై దృష్టి సారించాలని ఇటు వైద్యులకు అటు ప్రజలకు తెలియజేస్తున్నారు. నిత్యం పాజిటివ్‌ ‌కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజలు ప్రభుత్వ హాస్పిటళ్లలో కొరోనా పరీక్షలు చేయించుకునేందుకు గంటల తరబడి క్యూలో నిలుచుంటున్నారు ప్రభుత్వ వైద్యులు వైరస్‌ ‌లక్షణాలు ఉంటే తప్ప వైద్య పరీక్షలకు హాస్పిటళ్లకు రావద్దని సూచిస్తున్నారు.వైరస్‌ ‌బారిన పడిన వారి కుటుంబీకులు వైద్యుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో సరైన చికిత్సకు సదుపాయాలు లేవంటున్నారు. కార్పొరేట్‌ ‌హాస్పిటళ్లకు ధీటుగా ప్రభుత్వ హాస్పిటళ్లలో నిర్వహణ కొనసాగిస్తున్నామని రాజకీయ పెద్దలు చెప్పటం కేవలం మాటల వరకే పరిమితం అవుతున్నాయని అమలుకు నోచుకోవడం  లేదంటున్నారు. వైరస్‌ ‌సోకి చికిత్స పొందుతున్న వారందరూ మెరుగైన వైద్యం కోసం  ప్రైవేట్‌ ‌హాస్పిటళ్ల మెట్లు ఎక్కక తప్పటం లేదు. ప్రైవేట్‌ ‌హాస్పిటళ్ల యాజమాన్యాలు ఇదే అదనుగా అమాయక పేద ప్రజలను దోచుకుంటున్నారని వాపోతున్నారు. అయితే వైద్యాధికారులు, వైద్యులు మాత్రం ప్రభుత్వ హాస్పిటళ్లలో ఉన్న వైద్య సిబ్బందితో అహర్నిశల్ను కృషి చేస్తున్నామని తెలుపుతున్నారు.

మహబూబ్‌నగర్‌ ‌ప్రభుత్వ హాస్పిటల్‌ ‌సూప•రింటెండెంట్‌ ‌సూచనలు
ప్రజాతంత్ర ప్రతినిదితో• మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లా హాస్పిటల్‌ ‌సూప•రింటెండెంట్‌ ‌మాట్లాడుతూ ప్రజలు వైరస్‌ ‌బారిప పడ్డవారు భయపడాల్సిన పని లేదని అందుకు ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని అన్నారు. ప్రజలు వైరస్‌ ‌బారిన పడకుండా వైద్యుల సూచనలు, సలహాలు పాటించాలని, అంతేకాక వ్యాధి నిర్ధారణ కోసం వస్తున్నటువంటి బాధితులు ముఖ్యంగా లక్షణాలు దగ్గు, జ్వరం, విరేచనాలు, వాంతులు, ఒళ్ళు నొప్పులు ఉన్నవాళ్లు వైద్య పరీక్షలు చేసుకోవచ్చని, లక్షణాలు లేనివారు వైద్యపరీక్షల కోసం వచ్చి వారి సమయాన్ని, ఇటు వైద్యుల సమయాన్ని వృథా చేయరాదని కోరుతున్నారు. ఇలా చేస్తే నిజమైన లక్షణాలు ఉన్న వాళ్లకు వైద్య చికిత్సలు అందించడంలో ఆలస్యం జరుగుతుందన్నారు. సాధ్యమైనంతవరకు హోమ్‌ ఐసొల్యూషన్‌లో ఉండి  నిబంధనలు పాటించాలని తెలిపారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో వైద్యం అందించేందుకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటామని, ఎవరూ అధైర్య పడవద్దని ఆయన తెలిపారు

Leave a Reply