Take a fresh look at your lifestyle.

కొవిడ్ వల్ల నా కుమారుడిని కోల్పోయా..! సీతారామ్ ఏచూరి ట్వీట్

సీపీఎం ప్ర‌ధాన కార్య‌దర్శి, మాజీ రాజ్య‌స‌భ స‌భ్యులు సీతారా ఏచూరి పెద్ద కుమారుడు అశిష్(35) గురువారం ఉద‌యం మృత్యువాత ప‌డ్డారు. గ‌త రెండు వారాలుగా కరోనా బారినపడిన అశిష్ ఢిల్లీ గుర‌గ్రామ్‌లోని మేదాంత ఆసుప‌త్రిలో చికిత్స నిమిత్తం చేరారు. వ్యాధి నుంచి కొలుకుంటున్నార‌ని అంతా భావించిన స‌మ‌యంలోనే   ఇన్ ఫెక్ష‌న్ పెర‌గడంతో ఆయ‌న మ‌ర‌ణించార‌ని వైద్యులు ధృవీక‌రించార‌ని సీతారాం ఏచూరి ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. “కోవిడ్ -19 ఇన్ ఫెక్ష‌న్‌తో నా పెద్ద కుమారుడిని కోల్పోయాన‌న్న బాధాక‌ర‌మైన విష‌యం మీకు తెలియ‌జేస్తున్న‌. ఇంత‌టి క్లిష్ట స‌మ‌యంలో నా కుమారుడి చికిత్స‌కి స‌హ‌క‌రించిన డాక్ట‌ర్లు, న‌ర్సులు, ప్యారా మెడిక‌ల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు ధ‌న్య‌వాదాలు. నాకు అండ‌గా నిలిచిన వారికి కృతజ్ఞ‌త‌లు.” అంటూ ఏచూరి ట్విట్ చేశారు. దాంతోపాటు, మ‌రొక ట్విట్‌లో త‌న కుమారుడు బికూ(అశిష్‌)కి విడ్కోలు ప‌లికాన‌ని… ఈ బాధాతృప్త స‌మయంలో తన‌కి అండ‌గా నిలిచిన‌వారికి ధ‌న్య‌వాదాలు తెలుపుతూ… ఇంత‌మంది అండ‌గా ఉండ‌టంతో తాను ఒంట‌రి  కాద‌ని నిరూపితం అయింద‌న్నారు. త‌న బాధ‌ని పంచ‌కున్న ప్ర‌తి ఒక్క‌రికీ ఆయ‌న ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు.
అశిష్ ఏచూరి న్యూస్ లాండ్రి అనే ఆన్ లైన్ న్యూస్ పోర్ట‌ల్‌కి అసిస్టెంట్ ఎడిట‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. ఇంత‌కుముందు టైమ్స్ ఆఫ్ ఇండియా త‌దిత‌ర మీడియా సంస్థ‌ల‌కి ప‌ని చేసిన విష‌యం తెలిసిందే. సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో… ప్ర‌ముఖులు నివాళి అర్పించారు.  సీపీఐ(ఎం) సీతారాం ఏచూరి, ఇంద్రాణీ మ‌జుందార్‌ల కుమారుడు అశిష్(35) అకాల మ‌ర‌ణంపై సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో నివాళి అర్పించింది. అతి చిన్న వ‌య‌సులో అశిష్ మృతి చెంద‌డం బాధాక‌రమ‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు ఆ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యం ఏకేజీ భ‌వ‌న్ బుధ‌వారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. కాగా, అశిష్ మృతిపై ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు,  ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ, కేంద్ర‌మంత్రులు, జ‌వ‌డేక‌ర్‌, పియూష్ గోయ‌ల్‌, గ‌డ్క‌రీ, రాజ్‌నాథ్ సింగ్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌, కేర‌ళ సీఎం పిన‌ర‌య్ విజ‌య‌న్‌, ఏపీ సీఎం జ‌గ‌న్‌, రాజ‌స్థాన్ చీఫ్ మినిస్ట‌ర్ అశోక్ గెహ్లాట్‌, ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్‌,  సీపీఐ నేత డీ రాజా, కాంగ్రెస్ నేతలు రాహుల్‌, ప్రియాంక గాంధీ, శ‌శిథ‌రూర్‌, అధీర్ రంజ‌న్ చౌద‌రీ, మాజీ కేంద్ర‌మంత్రి శ‌ర‌ద్ పవార్‌, ఏఐఏడ‌బ్ల్యూయూ నేత బి వెంక‌ట్ త‌దిత‌‌ర వామ‌ప‌క్ష నేత‌లు నివాళి అర్పిస్తూ ప్ర‌క‌ట‌న‌లు విడుద‌ల చేశారు. అశిష్ సేవ‌లు పొందిన న్యూస్‌ లాండ్రి సంస్థ కూడా ఆయ‌న మ‌ర‌ణంపై నివాళి అర్పిస్తూ ప్రకటన చేసింది.

Leave a Reply