అమరావతి,మే 19 : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. ’ఆ క్షణం కోసం ఎల్లో డియా వారం రోజులపాటు ఎదురు చూసింది. ఎడిటోరియల్స్, కాంగ్రెస్ వాళ్లని రెచ్చగొట్టడాలు, టీవీల్లో జలజగడాలంటూ తగాదా పెట్టే చర్చలు అన్నీ నీరు కారిపోయాయి. కేసీఆర్ గారు ప్రెస్ ట్లో ఏదో అంటారని ఆశపడి భంగపడ్డారు.
బాబు కూడా లైవ్ చూశాడంట ఏదైనా వినిపిస్తుందేమో అని’ అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. కాగా మరో ట్వీట్లో.. ’కళ్లు మండుతు న్నాయా అని అన్నది నిన్నే బాబూ. పొరుగు రాష్ట్రంలో ప్రవాస జీవితం. ఢిల్లీలో చక్రాలు, బొంగరాలు తిప్పిన రోజులెక్కడ. పక్కింటి వాళ్లు కూడా గుర్తించని అజ్ఞాతవాసం ఎక్కడ. బయట అడుగుపెడితే క్షణాల్లో వీడియోలు సోషల్ డియాకెక్కుతున్నాయి. ఎంత కష్టం వచ్చిపడింది!’ అంటూ విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.