Take a fresh look at your lifestyle.

కర్నూలులో ప్రబలిన అతిసార

  • గోరుకల్లులో కలుషితనీరు తాగి నలుగురు మృతి
  • నంద్యాల  ,ఆదోని అస్పత్రుల్లో బాధితులకు చికిత్స

జిల్లాలోని ఆదోని, పాణ్యంలోఅతిసార ప్రబలింది. జిల్లాలో అతిసారకు నలుగురు మృతి చెందారు.  ఆదోని అరుణజ్యోతి నగర్‌లో 25 మంది అస్వస్థతకు గురయ్యారు. ఆదోని, నంద్యాల ఆసుపత్రుల్లో అతిసార బాధితులకు చికిత్స పొందుతున్నారు.  రోగులతో నంద్యాల, ఆదోని ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. పాణ్యం మండలం గోరుకల్లులో అతిసార ప్రబలడంతో నీటి సరఫరా నిలిపివేశారు. నంద్యాల నుంచి గోరుకల్లుకు ట్యాంకర్ల ద్వారా అధికారులు నీటిని సరఫరా చేయిస్తున్నారు. మరో వందమందికిపైగా ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కలుషిత నీరు తాగి గ్రామస్తులు చనిపోతుండడంతో గోరుకల్లు వాసులు ఊరు విడిచి ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. పాణ్యం మండలంలో గోరుకల్లులో మూడు రోజుల నుంచి కలుషిత నీరుతాగి 30 మందికిపైగా అస్వస్థతకులోనయ్యారు. వారిలో కిట్టు, హుస్సేన్‌, ‌మద్దమ్మ చనిపోయారు.

మరికొందరు అస్వస్థతకు గురై అస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. గోరుకల్లును నంద్యాల సబ్‌ ‌కలెక్టర్‌ ‌కల్పనకుమారి, డీఎంహెచ్‌వోతోపాటు మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సందర్శించారు. కొత్త డ్రైన్‌, ‌పైపులైన్లు వేసేందుకు చర్యలు చేపడతామని హావి• ఇచ్చారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల మురుగునీరు తాగునీటిలో కలిసి కలుషిత మైందని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని గౌరు చరితారెడ్డి అన్నారు.  కొత్త డ్రైన్‌, ‌పైపులైన్లు వేసేందుకు చర్యలు చేపడతామని హావి• ఇచ్చారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల మురుగునీరు.. తాగునీటిలో కలిసి కలుషితమైందని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని గౌరు చరితారెడ్డి అన్నారు.

Leave a Reply