Take a fresh look at your lifestyle.

నిరుత్సాహమెందుకు?

మనిషివై పుట్టినందుకు
మనోవేదనెందుకు
మనసుపెట్టి వెదుకు
మార్గమంతా
నీకు చూపించు
గమ్యం కళ్ళముందు నిలుపు
నిరుత్సాహం వెంటాడినా
నీలోని నిన్ను నిదురలేపు
ఆరిపోని లక్ష్యం నిన్నచేరేలా
నిన్ను నీవే మలచుకో
ఒడిదుడుకులెన్నడ్డమొచ్చినా
ఓటమిని ఓడించి
గెలుపుశిఖరం నీవు చేరాలోయ్‌
‌నుదుటిరాతలేముందో ఎవరికి తెలుసు?
కష్టపడితేనే కదా కలతీరం చేరేది
బతుకు తోవన వెలుగురేఖలు
వేవేల ఆశల స్వప్నం నెరవేరగా
తరగని కీర్తి నీకందగా
విజయాల పరిమళం విశ్వమంతా వెదజల్లేలా
నీ అంతరాత్మ ఆనందమొందగ
అందరికీ నీవాదర్శమవ్వగా
ఉత్సాహసూర్యుడిలా
గెలుపు నీ తలుపు తట్టేదాకా
కాలంతో పోటిపడు
కాలగర్భంలో కలిసిపోని
చరిత్రను లిఖించగా
– సి. శేఖర్‌(‌సియస్సార్‌),
‌పాలమూరు, 9010480557.

Leave a Reply