Take a fresh look at your lifestyle.

ఆపదలో ఉన్నప్పుడు 100కు డయల్‌ ‌చేయండి జిల్లా ఎస్పీ సునీల్‌ ‌దత్‌

Dial 100, danger, sheteam, District SP Sunil Dutt

జిల్లా ఎస్పీ సునీల్‌ ‌దత్‌ ఆదేశాల మేరకు శుక్రవారం కొత్తగూడెం త్రీటౌన్‌ ‌సీఐ ఆదినారాయణ త్రీ టౌన్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో గల రామచంద్ర హైస్కూల్‌ ‌నందు డయల్‌ 100 ‌పై విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రోహిత్‌ ‌రాజు ఐపిఎస్‌ ‌పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 300 మంది విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ట్రైని ఐపీఎస్‌ ‌మాట్లాడుతూ ఏదైనా ఆపద ఎదురైనప్పుడు డయల్‌ 100 ‌నకు ఫోన్‌ ‌చేయడానికి భయపడాల్సిన అవసరం లేదని తెలియజేశారు. పోలీసు వారు ఎల్లప్పుడు తమ రక్షణ కోసమే పాటుపడుతూ ఉంటారని అన్నారు. ఆకతాయిల వలన గాని, మరే ఇతర వ్యక్తుల వలన గాని ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే పోలీసు వారి సహాయం కోసం 100 కు ఫోన్‌ ‌చేయాలని కోరారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ ఎల్లప్పుడూ స్కూళ్ల వద్ద,కాలేజీలు,రైల్వే స్టేషన్‌, ‌బస్టాండ్ల వద్ద నిరంతరం మఫ్టీ దుస్తులలో సంచరిస్తూ ఉంటారని తెలిపారు. అదే విధంగా విద్యార్థులు అందరూ కూడా శ్రద్ధగా చదువు కొని ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో చేరి ప్రజలకు సేవ చేస్తూ తమ తల్లిదండ్రులకు మరియు తమ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో త్రీటౌన్‌ ఎస్‌ఐ ‌బి.శ్రీనివాసరావు మరియు పాఠ శాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Tags: Dial 100, danger, sheteam, District SP Sunil Dutt

Leave A Reply

Your email address will not be published.