
డయల్ 100 కాల్స్ కు వెంటనే స్పందించి,రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలి అని జిల్లా ఎస్పీ సిందూశర్మ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశా న్ని జిల్లా ఎస్పీ సింధు శర్మ ఐపీఎస్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే ప్రాంతాల పై నిఘా ఉంచాలని వారి పై కేస్ లు నమోదు చేయాలని అన్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వ్యక్తులు, ప్రదేశాలపై స్థానిక ప్రజల నుండి సమాచారం సేకరించి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు, వాహన తనిఖీలు నిర్వహించాలని డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వ్యక్తుల యొక్క డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని ఆ యొక్క లైసెన్స్ రద్దుకు సంబంధిత రవాణా శాఖ అధికారులకు సిఫారసు చేయాలని అన్నారు.
నేరల నియంత్రణతో పాటు దర్యాప్తు చేధనకు దోహదపడే సిసి కెమెరాలు నేను సైతం అనే కార్యక్రమం ద్వారా గ్రామాల్లోని ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, గ్రామ పెద్దలకు, వివిధ సంఘాల నాయకులకు, వివిధ యూనియన్ నాయకులకు, వ్యాపారస్తులకు అవగాహన కల్పించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు.సిసిటియన్ యస్ ప్రాజెక్టు ద్వారా ప్రతి దరఖాస్తులను మరియు యఫ్.ఐ.అర్ లను, సిడిఎఫ్, పార్ట్-1, పార్ట్-2 రిమాండ్ సిడి, ఛార్జ్ షీట్, కోర్టు డిస్పోజల్ ఆన్ లైన్ లో ప్రతి రోజు ఎంటర్ చేయలని ఆదేశించారు ఈ పనిని ప్రతిరోజు సీఐలు, డీఎస్పీ లు మానిటర్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ దక్షిణామూర్తి, డీఎస్పీలు వెంకటరమణ, ప్రతాప్ సి.ఐ లు ఎస్.ఐ లు, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.