కరోనా వైరస్ ప్రభావంతో లాక్డౌన్ విధించిన వేళ డయల్ 100కు వచ్చే ఫోన్‌కాల్స్ సంఖ్య భారీగా పెరిగినట్టు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు.కేవలం మూడు రోజుల వ్యవధిలోనే 6.4లక్షల కాల్స్ వచ్చాయని తెలిపారు.
సామాజిక దూరం పాటించని వాళ్ల గురించి కొందరు ఫిర్యాదు చేయగా.. మరికొందరైతే కరోనా అనుమానితుల సమాచారం ఇచ్చారని తెలిపారు. ఈ సమయంలో ఇంటికి పరిమితం కావడమే మనముందున్న ప్రత్యామ్నాయమన్నారు డీజీపీ పేర్కొన్నారు. ప్రజలందరూ సామాజిక దూరం పాటించడంతో పాటు పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.