Take a fresh look at your lifestyle.

ధీశాలి ..మమత .!

75 సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకలు ‘ఆజాదీ అమృత్‌ ‌మహోత్సవ్‌ ‘ ‌జరుపుకోవడానికి యావత్‌ ‌దేశం ఉత్సాహం తో ఉంది. ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారత్‌ ‌ను సుమారు 55 సంవత్సరాలు పాలించి..స్వాతంత్ర సమరంలో అగ్ర భాగాన నిలిచిన 150 సంవత్సరాల చరిత్ర కలిగిన అఖిల భారత కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రతిభ రోజురోజుకు మసక బారుతున్నది. ‘కాంగ్రెస్‌ ‌ముక్త్ ‌భారత్‌ ‘ ‌నినాదంతో ఉత్తర భారత్‌ ‌కే పరిమితం అని భావించిన భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా విస్తరించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. చైనా తరహా ఏక పార్టీ విధానాన్ని భారత్‌ ‌లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుందని కొందరు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.ప్రతి రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీ పఠిష్టం గా ఉన్న నేపథ్యంలో బీజేపీ ఆలోచన సాధ్యం కాకపోవొచ్చు. రాష్ట్రాల్లో బలంగా ఉన్న కొన్ని ప్రాంతీయ పార్టీ అధినేతలు ఒకప్పుడు కాంగ్రెస్‌ ‌పార్టీ సభ్యులే..!కాంగ్రెస్‌ ‌పార్టీ నుంచి బయటికి వొచ్చి నిలదొక్కున్న వారిలో ముఖ్యులు శరద్‌ ‌పవార్‌ ,‌మమతా బెనర్జీ ,ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి వై ఎస్‌ ‌జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి..! కాంగ్రెస్‌ ‌పార్టీ నుంచి బయటికొచ్చి ..పార్టీలు పెట్టి అనేకులు తెరమరుగయ్యారు.

ప్రస్తుతం జరుగుతున్నా అయిదు రాష్ట్రాల ఎన్నికలను ‘కాంగ్రెస్‌ ‌ముఖ్త్ ‌భారత్‌ ‘ ‌ను ఆశిస్తున్నా భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నది. తమిళ నాడులో ప్రాంతీయ పార్టీ ఆల్‌ ఇం‌డియా అన్నా డీ ఎం కె తో పొత్తులో 20 అసెంబ్లీ స్థానాలలో పోటీ తో సరిపెట్టుకున్నది .పశ్చిమాన బెంగాల్‌ ‌లో మమతా బెనర్జీ తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌తో తలపడుతుంది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా జరుగుతున్నా చర్చ బెంగాల్‌ ఎన్నికల ఫలితాల పైననే…!భారత దేశ ఆధునిక రాజకీయ చరిత్రలో అత్యంత శక్తివంతమయిన ..ఒకప్పుడు..సి పీ ఎం పార్టీ ని మట్టి కరిపించి ..రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి గా బెంగాల్‌ ‌ప్రజల ఆదరణ పొందిన మమతా బెనర్జీ భారతీయ జనతా పార్టీ జైత్ర యాత్ర ను అడ్డుకుంటారా అన్న చర్చ దేశ వ్యాప్తంగా జరుగుతున్నది. తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ …భారతీయ జనతా పార్టీ ముఖ్య నేత ,దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యక్తిత్వాల్లో కొన్ని సారూప్యతులున్నాయి.

ఇద్దరూ రాజకీయ కుటుంబ నేపథ్యం గానీ ,వారసత్వం గానీ లేని మధ్య తరగతి కుటుంబం నుంచి వొచ్చిన వారే ..! అభేద్య కమ్యూనిస్ట్ ‌కంచుకోట ను మమతా బెనర్జీ బద్దలు చేస్తే ..55 సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ ‌పార్టీ ని మట్టి కురిపించిన నాయకుడు నరేంద్ర మోడీ ..! కానీ భారత రాజకీయాల్లో మమతా బెనర్జీ వంటి మహిళా నేత మరొకరు కనిపించరు. అధికారం అనుభవించిన మహిళా నేతలు …సోనియా గాంధీ ,జయలలిత ,మాయావతి వంటి వారు మనకు తెలుసు. భర్త రాజీవ్‌ ‌వారసత్వం తో సోనియా గాంధీ ,తమిళనాడు మాజీ ముఖ్య మంత్రి ఎంజీ రామ చంద్రన్‌ ‌వారసురాలిగా జయలలిత నిలదొక్కుకున్నారు .

mamatha on wheel chair

కాన్షీ రామ్‌ ‌వారసత్వాన్ని పలు వివాదాల నడుమ మాయావతి స్వాధీనం చేసుకున్నారు. తన పార్టీ ని ఒంటి చేత్తో ,సొంత కష్టం తో నిర్మించుకున్న మహిళా నాయకురాలు మమతా బెనర్జీ ఒక్కరే అనడంలో సందేహం లేదు .. ! కాంగ్రెస్‌ ‌పార్టీ తో విభేదించి ,,బయటికొచ్చి తృణమూల్‌ ‌కాంగ్రస్‌ ‌పార్టీ స్థాపించిన తరువాత 1999 లో మమతా బెనర్జీ పది మంది ఎంపీలను గెలిపించుకున్నారు. తద్వారా వాజపాయ్‌ ‌నేతృత్వం లోని బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.

2009 లో తన పార్టీ ద్వారా 19 స్థానాలను ,పొత్తులో కాంగ్రెస్‌ ‌పార్టీ కి మరో ఆరు స్థానాలను సాధించారు. యూపీఏ-2 ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.దశాబ్ద కాలం పాటు దేశ రాజకీయాల్లో ,కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించిన మమతా బెనర్జీ 2011 బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 35 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన కమ్యూనిస్టులను మట్టి కరిపించారు. ప్రస్తుతం జరుగుతున్న ఆ రాష్ట్ర ఎన్నికల్లో మమతా బెనర్జీ పార్టీ తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ …‌భారత రాజకీయాల్లో సుదీర్ఘ చరిత్ర, అనుభవం కలిగిన నరేంద్ర మోడీ నాయకత్వం లోని భారతీయ జనతా పార్టీ ని ఎదుర్కోబోతున్నారు. ఎన్నికల్లో గెలవడానికి డబ్బు అవసరం లేదని మమతా బెనర్జీ రుజువు చేశారు. హింసా ధోరణితో భయోత్పాతాన్ని సృష్టించిన పార్టీకి ,ప్రభుత్వానికి ధీరత్వంతో పోరాడిన చరిత్ర ఆమెది..మమతా బెనర్జీ వెనుక ఉన్న జనమే కాదు యావత్‌ ‌భారత దేశం బెంగాల్‌ ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నది.

Leave a Reply