Take a fresh look at your lifestyle.

నిజాం వ్యతిరేక పోరాట వీరుడు దాశరథి

“1948 ‌సంవత్సరంలో వరంగల్‌ ‌జిల్లా జైలు నుండి దాశరధిని నిజాంబాద్‌ ‌జైలుకు ఆనాటి నిజాం నవాబు ప్రభుత్వం తరలించింది. అయినా ఏమాత్రం బెదరకుండా జైలు లోపల కలం కాగితం లేకున్నా బొగ్గు తోనే జనచైతన్యం కలిగించే కవితలు రాయకుండా ఉండలేదు దాశరధి. జైలు గోడల పైన  బొగ్గు తోనే ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ రాసి ఒక రాజ్యంలో ఆ రాజు కే ఎదురుతిరిగిన కవుల్లో పోతన తర్వాత దాశరధి ప్రస్థానం దక్కింది. జైలు గోడల మధ్య మా నిజాం రాజు జన్మజన్మల బూజు ముసలి నక్కకు రాజరికము దక్కునే అని నిర్భయంగా గర్జించిన మహాకవి దాశరథి. అదేవిధంగా సాహితీరంగంలో పద్య గేయ సినీ గీతం ఇలా ఏది రాసిన పాఠకుల హృదయాలను రంజింప చేసిన ధీరోదాత్తుడు దాశరధి.”

ఆయన మహా కవి సాహితీవేత్త గొప్ప ఉపన్యాసకుడు దేశభక్తుడు తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్నిధారగా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు. ఆయన సుప్రసిద్ధులు తన పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి ఇప్పటి ఉద్యమానికి ప్రేరణ అందించిన మహాకవి దాశరధి. నాటి నిజామును పిశాచి గా వర్ణిస్తూ తెలంగాణ ప్రజానీకాన్ని మేల్కొల్పిన కలం దీరుడు దాశరధి. తన రచనల్లో నవరసాలను పలికించి తెలుగు జన హృదయాలను గెలుచుకున్న ధీరశాలి దాశరథి. ఉర్దూ తన సాహిత్య మాతృభాష అన్న నవాబ్‌  ‌దాశరథి. సినిమా ప్రపంచంలో లాజవాబ్‌ ‌దాశరథి. పిల్లల కోసం పల్లవులు రాశాడు. పెద్దల కోసం వ్యాసాలు రాశాడు. అతని కాలంలో నవలను నాటకాలు కల కన్నది తెలంగాణలో ఎందరో కవులు ఉన్నప్పటికీ పీడిత ప్రజల పక్షాన నిలిచి వారి సమస్యలకు ప్రాధాన్యత నిచ్చి గొంతెత్తి చెప్పగలిగిన మహాకవి దాశరధి. తెలంగాణను తన కలం బలం ద్వారా ఉర్రూతలూగించిన మహాకవి వైతాళికుడు దాశరధి. తన పద్యాల ద్వారా గర్జించి కవిత్వాన్ని అగ్ని దారులుగా కురిపించిన అచ్చమైన మధురకవి దాశరధి. ప్రాచీన ఆధునిక కాల వారధిగా పేరుగాంచిన వ్యక్తి  దాశరథి. తెలంగాణ వారికే కాక తెలుగు ప్రజలందరి సంపదగా పేర్కొనవచ్చును. ఏను సవమముగ కవితను వరించలేదు తానే వరించే కవిత రాణి నన్ను అని ధైర్యంగా అన్న మహాకవి దాశరథి. నన్ను గని పెంచినట్టు కరుణామయి నా తెలంగాణ అని గర్వంగా ప్రకటించిన అసలుసిసలైన తెలంగాణవాది మన మన దాశరధి కృష్ణమాచార్యులు. దాశరధి కృష్ణమాచార్యులు ఒక సామాన్య మధ్యతరగతి వైష్ణవ కుటుంబంలో 19 25 జూలై 22 న వరంగల్‌ ‌జిల్లా మానుకోట తాలూకా లోని చిన్నగూడూరు గ్రామం లో వెంకటాచార్యులు వెంకటమ్మ దంపతులకు జన్మించినారు.

సాంప్రదాయ కుటుంబంలో జన్మించిన దాశరథి అనేక భాషలలో నిష్ణాతులుగా పేరు ప్రఖ్యాతులు పొందారు. ఖమ్మం లో చదువుకునే రోజుల్లో ఆంధ్ర మహాసభ కార్యకర్తగా పని చేశారు ఆ సమయంలో కందుకూరి వీరేశలింగం మహాత్మాగాంధీ రఘుపతి వెంకటరత్నం కారల్‌ ‌మార్కస్ ‌వంటి ఎందరో మహనీయుల ప్రభావం చూపింది. భారతదేశ స్వాతంత్రం పోరాట చివరి ఘటాల  అనుభవముతో పాటు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాల అనుభవాలను గడించిన దాశరధి తన రక్తంతో అణువణువునా తెలంగాణవాదాన్ని జీర్ణించుకున్న మహాకవి దాశరథి. అసలు వీరి కుటుంబమే సాహిత్య సేవకు అంకితం అయ్యింది. దాశరధి రంగాచార్యులు వీరికి స్వయానా తమ్ముడు.అగర్భ శ్రీమంతునికి అనాధ కి మధ్య చిరకాలం నుండి జరుగుతున్న సంఘర్షణ మే దాశరథి కి కవిత వస్తువు అయ్యింది. ఆనాటి ప్రజల కష్టనష్టాలను దాశరధిని కాల రుద్రుని చేసినను. 1949 సంవత్సరంలో దాశరథి మొట్టమొదట పుస్తకం అగ్నిధార నల్లగొండ జిల్లా చండూరు లో సాహితీ మేధావుల పక్షాన అచ్చు కాబడి అదే జిల్లాకు చెందిన గొప్ప మేధావి రచయిత వట్టికోట ఆళ్వారుస్వామి కి అంకితం మిచ్చి ధన్యులు అయినట్టు దాశరధి స్వయంగా చెప్పాడు.

తో పాటు రుద్రవీణ మహాంధ్రోదయం అమృతాభిషేకం దాశరధి శతకం తిమిరంతో సమరం నవ మంజరి వంటి పుస్తకాలు దాశరథి కలం నుండి జూలువారినవే. ఇతని కవిత్వాలు తెలుగుదనం ఉట్టిపడుతుంది. ఏది కాకతి ఎవరు రుద్రమదేవి ఎవరు సింగన్న అన్ని నేనే అంత నేనే వెలుగు నేనే తెలుగు నేనే అని అంటూ ఆవేశంతో గర్జించిన సింహం మన దాశరథి. నిజాం నిరంకుశత్వా పాలన పై రజాకార్ల మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడిన జైలు జీవితం అనుభవించిన స్వాతంత్ర సమరయోధుడు మన దాశరధి. తన కలాన్ని గళాన్ని ప్రజల విముక్తి కోసం సమస్త మానవాళి కోసం ప్రజల శ్రేయస్సు కోసం అంకితం చేసిన యోధుడు దాశరథి. ఆయన రచించిన అగ్నిధార 1000 జలపాతాల వేగంతో సాగిపోయింది. ఇంకా ఆయన కలం నుండి పుట్టిన రుద్రవీణ లోని విప్లవ గీతాలు గేయాలు మరువలేనిది. దాశరధి రాసిన కవిత్వం లో మోదుగు పూలు శృంగార వీర రసాలుగా పేరుగాంచినవి. 1944 సంవత్సరంలో ఓరుగల్లు కోటలో ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన కవి సమ్మేళనం వేదిక పందిళ్లను రజాకారు మతోన్మాదులు నిప్పు కాల్చి వేశారు. సభాకులపై రజాకార్‌ ‌దుండగులు రాళ్లతో విసిరారు. అయినప్పటికీ ఏమాత్రం బెదరకుండా సురవరం దేవులపల్లి వంటి వారు ధైర్యంగా నిలిచి కవి సమ్మేళనం కావలసిందేనని నిర్ణయించారు. అట్ల కూలిన పందిళ్ళ పైనే దాశరధి తన మొదటి పద్యాన్ని వినిపించి కవనం తో సమర శంఖారావం పూరించాడు. 1948 సంవత్సరంలో వరంగల్‌ ‌జిల్లా జైలు నుండి దాశరధిని నిజాంబాద్‌ ‌జైలుకు ఆనాటి నిజాం నవాబు ప్రభుత్వం తరలించింది. అయినా ఏమాత్రం బెదరకుండా జైలు లోపల కలం కాగితం లేకున్నా బొగ్గు తోనే జనచైతన్యం కలిగించే కవితలు రాయకుండా ఉండలేదు దాశరధి. జైలు గోడల పైన  బొగ్గు తోనే ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ రాసి ఒక రాజ్యంలో ఆ రాజు కే ఎదురుతిరిగిన కవుల్లో పోతన తర్వాత దాశరధి ప్రస్థానం దక్కింది. జైలు గోడల మధ్య మా నిజాం రాజు జన్మజన్మల బూజు ముసలి నక్కకు రాజరికము దక్కునే అని నిర్భయంగా గర్జించిన మహాకవి దాశరథి. అదేవిధంగా సాహితీరంగంలో పద్య గేయ సినీ గీతం ఇలా ఏది రాసిన పాఠకుల హృదయాలను రంజింప చేసిన ధీరోదాత్తుడు దాశరధి. అనేక ప్రక్రియల్లో తన వచన రచనా శైలిని చూపడం జరిగింది. కథలు నాటికలు సినిమా పాటలు కవితలు ఇలా ఎన్నో రాశాడు. 1961 సంవత్సరంలో ఇద్దరు మిత్రులు సినిమాలో ఖుషి ఖుషి గా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ అనేక పాటలు రాసి ఆయన సినీరంగ ప్రవేశం చేశారు. దాశరధి ప్రాచీన ఆధునిక కవిత్వ వారధిగా నిలిచాడు. దాశరధి గారి ప్రసంగాలు సునీశీల చతురోక్తులతో అనర్గళంగా సాగిపోతూ వినసొంపుగా ఉండేవి.

1967 సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్‌ ‌సాహిత్య అకాడమీ అవార్డు తో పాటు 1974 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా పొందాడు. వీటితో పాటుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆగ్రా విశ్వవిద్యాలయం నుండి  గౌరవడాక్టరేట్లను కూడా జరిగింది. 1977 నుండి1984 సంవత్సరం వరకు దాశరధి ఆంధ్రప్రదేశ్‌ ఆస్థానకవిగా పని చేశారు. చివరకు 19 87 నవంబర్‌ 5‌న తేదీన చనిపోయారు. ఇవాళ దాశరధి కృష్ణమాచార్యులు మనమధ్య భౌతికంగా లేకపోవచ్చు కానీ వారి రచనలు పాటలు పద్యాలు నిత్య నూతనం కలిగిస్తూ భావితరాలకు మార్గదర్శకంగా ఉపయోగపడుతాయి. ఆయన ఎప్పటికీ తెలంగాణ ప్రజల వారి గుండెల్లో స్వచ్ఛమైన కవిగా నిలిచిపోయిన వ్యక్తి దాశరధి కృష్ణమాచార్యులు. దాశరధి తెలంగాణకే కాదు యావత్‌ ‌తెలుగు సాహితీ ప్రపంచంలో ఎల్లవేళల నిలిచి ఉండే మహనీయుడు మహాకవి దాశరథి.

– నరేష్‌ ‌జాటోత్‌. ఎంఏ .‌బీఈడీ. కాకతీయ విశ్వవిద్యాలయం(8247887267)

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply