Take a fresh look at your lifestyle.

12‌న అన్ని మండల, నియోజక వర్గ కేంద్రాల్లో కేంద్రం వరికొనాలంటూ ధర్నాలు: సిఎం కెసిఆర్‌ ‌వెల్లడి

అన్ని మండల, నియోజక వర్గ కేంద్రాల్లో కేంద్రం రైతులు పండించిన వరి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ ఈ నెల 12 శుక్రవారం రోజున రైతులతో కలిసి ధర్నాలు నిర్వహిస్తామని వెల్లడించారు. నాతో ధర్నాలో కూర్చుంటావా అని ఆయన బిజెపి రాష్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని ప్రశించారు. కేంద్రం వరి పంటను కొనుగోలు చేయాల్సిందేనని ఈ సందర్భంగా ఆయన డిమాండ్‌ ‌చేశారు.

అమీ తుమీ తేల్చుకునేవరకు ధర్మపోరాటం కొనసాగిస్తామని సిఎం స్పష్టం చేశారు. ఈ విషయంపై బిజెపి నేతలను, ప్రజాప్రతినిధులను ఊరూరా ఎక్కడికక్కడే నిలదీయాలని సిఎం కెసిఆర్‌ ఈ ‌సందర్భంగా రైతులకు పిలుపునిచారు. ధాన్యం కొనుగోలుపై ఎంతవరకైనా పోవడానికి సిద్ధమని ఆయన పునరుద్ఘాటించారు.

Leave a Reply