Take a fresh look at your lifestyle.

విద్యుత్‌ ‌చార్జీలు తగ్గించాలని కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ధర్నా

నాగర్‌ ‌కర్నూల్‌,‌జులై 6.ప్రజాతంత్రవిలేకరి: పెంచిన విద్యుత్‌ ‌చార్జీలకు వ్యతిరేకంగా కొల్లాపూర్‌ ‌పట్టణంలో కాంగ్రెస్‌ ‌పార్టీ ఆధ్వ ర్యంలో విద్యుత్‌ ‌కార్యాలయంముందు ధర్నా నిర్వహించారు.ధర్నాకార్యక్రమం అనంతరం విద్యుత్తు శాఖ అధికారులకు మెమోరాండం అందించడం జరిగింది.ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకులు టీపీ సీసీ కార్యనిర్వాహక కార్యదర్శి రంగినేని జగదీశ్వర్‌ ‌లు,ఓబీసీ సెల్‌ ‌జిల్లా అధ్యక్షులు గాలి యాదవ్‌ ,‌బ్లాక్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్షులు రాము యాదవ్‌ ఈ ‌ధర్నానుద్దేశించి మాట్లాడుతూ..కోవిడ్‌-19 ‌కారణంగా మన రాష్ట్ర ప్రజలు అన్ని విధాలుగా జీవనోపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో సతమత మవుతున్నారని అన్నారు.ఇలాంటి సమయంలో కరెంట్‌ ‌బిల్‌ ‌చార్జీలు పేద ప్రజలకు కరెంట్‌ ‌షాక్‌ ‌లా తగులుతున్నా యని అన్నారు.

ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోని ప్రభుత్వమే 3 నెలల పాటు కరెంట్‌ ‌చార్జీలను చెల్లించాలని డిమాండ్‌ ‌చేశారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరు పేద ప్రజల కరెంట్‌ ‌బిల్లులను ప్రభుత్వమే మాఫీ చేసి వారికి ఉచిత కరెంట్‌ అం‌దించాలని కాంగ్రెస్‌ ‌పార్టీ డిమాండ్‌ ‌చేస్తుందని తెలిపారు. కరెంట్‌ ‌బిల్లుల విషయంలో టేలిస్కోపిక్‌ ‌విధానంలో గత ప్రభుత్వం అవలభించిన విధానాన్ని ప్రవేశ పెట్టి ప్రజలపై భారం తగ్గించాలని కాంగ్రెస్‌ ‌పార్టీ డిమాండ్‌ ‌చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లపూర్‌ ‌టౌన్‌ అధ్యక్షులు డిజే ప్రమోద్‌,‌టౌన్‌ ‌యూత్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్షులు కురుమయ్య, కాంగ్రెస్‌ ‌నాయకులు కంటే శివన్న, ముస్తక్‌, ‌బాబా, క్రాంతి,క్రాంతారావు,పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply